US Election 2024: అమెరికా అధ్యక్షుడికి జీతమెంత వస్తుందో తెలుసా..? ఎలాంటి సౌకర్యాలు అందుతాయంటే..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి దేశానికి అధ్యక్షుడిగాఉన్న వ్యక్తికి ఏడాదికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకుందా.

US president salary: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కోలాహలం నెలకొంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇద్దరు ఎవరు గెలుస్తారోనని ప్రపంచంలోని అన్ని దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే, కొన్ని సర్వేలు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తాడని చెబుతుండగా.. మరికొన్ని సర్వేలు కమలా హారిస్ వైపు మొగ్గు చూపాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా 2025 జనవరి 20వ తేదీన అగ్రరాజ్యం అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి దేశానికి అధ్యక్షుడిగాఉన్న వ్యక్తికి ఏడాదికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకుందా.

Also Read: US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వంసిద్ధం.. నేడే పోలింగ్.. ఫలితం ఎప్పుడంటే?

అమెరికాలో అధ్యక్షుడి జీతం సాధారణ పౌరుడి సగటు జీతం కంటే ఆరు రెట్లు ఎక్కువ. అమెరికన్ ప్రతీయేటా 63వేల 795 డాలర్లు (దాదాపు 53లక్షల రూపాయలు) సంపాదిస్తున్నాడు. దేశంలోని దనవంతుల గురించి చెప్పాలంటే, వారి వార్షిక సగటు ఆదాయం 7లక్షల 88వేల డాలర్లు (రూ.6.28కోట్లు) ఉంటుంది. అయితే, అమెరికా అధ్యక్షుడి జీతం గురించి చెప్పాలంటే.. అతనికి ఏడాది 4.4 లక్షల డాలర్లు (రూ. 3.36 కోట్లు) అందుతుంది. ఖర్చులకు మరో 50వేల డాలర్లు (రూ.42లక్షలు) పొందుతారు. ఆయనకు వైట్ హౌస్ లో ఉచిత నివాస సదుపాయం ఉంటుంది. వినోదం కోసం, సిబ్బంది, వంటవారు ఇలా పలు అవసరాలకోసం ఏడాది 19వేల డాలర్లు (రూ.16లక్షలు), ఉచిత ఆరోగ్య సేవలు లభిస్తాయి. ప్రయాణ ఖర్చుల కోసం పన్నులు వేయని లక్ష డాలర్లు (రూ.84లక్షలు) ఇస్తారు. ఈ వార్షిక వేతనాన్ని జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారం చేపట్టడానికి ముందు 2001లో యూఎస్ కాంగ్రెస్ చివరిసారిగా పెంచింది. యూఎస్ అధ్యక్షుడిగా వైదొలిగిన తరువాత అదనపు పెన్షన్ వంటి ఇతర ప్రోత్సాహకాలనుకూడా అందుకుంటాడు. అయితే, యూఎస్ ప్రథమ మహిళలకు ఎలాంటి జీతం అందదు.

Also Read : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎవరీ డొనాల్డ్ ట్రంప్? కమలా హారిస్‌‌ చరిత్ర ఏంటి? భారత్‌‌తో ఉన్న సంబంధం ఏంటి?

యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వైట్ హౌస్ రీమోడలింగ్ కోసం లక్ష డాలర్లు అందుకుంటారు. అయితే.. ఒరాక్ ఒబామా వంటి పలువురు అధ్యక్షులు ఆ డబ్బును ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు. బదులుగా వారి సొంత ఖర్చులతో వైట్ హౌస్ రీ మోడలింగ్ చేయించుకున్నారు. ఇదిలాఉంటే.. యూఎస్ అధ్యక్షుడు తన వేతనాన్ని తీసుకోకుండా నిరాకరించవచ్చా అంటే.. అలా వీలుండదు. జీతాన్ని వద్దు అనడానికి అనుమతి ఉండదు. కానీ, వారు సూచించిన సంస్థలకు ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వొచ్చు.