అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎవరీ డొనాల్డ్ ట్రంప్? కమలా హారిస్ చరిత్ర ఏంటి? భారత్‌తో ఉన్న సంబంధం ఏంటి?
ఇలా ట్రంప్, హారిస్.. ఇద్దరూ.. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మరిప్పుడు వైట్ హౌస్ రేసులో ఎవరు ఎవరిని పడగతారో చూడాలి.

Trump Kamala Harris Political Journey : అమెరికా బిగ్ బాస్ రేసులో డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని వివాదాలు చుట్టుముట్టినా, తుపాకులు అటాక్ చేసినా అదరకుండా బెదరకుండా బరిలో దూసుకెళ్తున్నారు ట్రంప్. ఇటు కమలా హారిస్ పోటీలోకి లేటుగా వచ్చినా ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ ఎవరి అంచనాలకు అందకుండా సైలెంట్ గా దూసుకొచ్చారు. ఇంతకీ ఎవరీ ట్రంప్. వారి పూర్వీకులు ఎక్కడి నుంచి అమెరికాకు వచ్చారు. కమలా హారిస్ చరిత్ర ఏంటి. ఆమెకు మన భారత్ కు ఉన్న సంబంధం ఏంటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. ఆ దేశానికి రెండోసారి ప్రెసిడెంట్ అవుతారు. ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ నెగ్గితే వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హారిస్ వైట్ హాస్ బాస్ గా మారిపోతారు. ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తుని కొన్ని గంటల్లో అమెరికా ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, పొలిటికల్ లైఫ్..
* అమెరికా అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఈ ఇద్దరికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.
* ట్రంప్… రియల్ ఎస్టేట్ రంగం నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగారు.
* కమలా హారిస్.. కూడా న్యాయవాది వృత్తి నుంచి వైస్ ప్రెసిడెంట్ గా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు.
* ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు.
* డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు.
* ఆయన నాలుగో సంతానమే డొనాల్డ్ ట్రంప్.
* 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరారు.
* యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.
* ఆ తర్వాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు ట్రంప్.
* తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని సొంతంగా రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యారు.
* వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు.
* 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.
* అప్పట్లో హిల్లరీ క్లింటన్ ను ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ట్రంప్.
* అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక వ్యాపార బాధ్యతలను కుమారులకు అప్పగించారు ట్రంప్.
* మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.
* మొదటి భార్య ఇవానాకు ముగ్గురు పిల్లలు, రెండో భార్యకు ఒక కూతురు ఉన్నారు. 2005లో మెలానియాను మూడో వివాహం చేసుకున్నారు. వారికి బారన్ అనే కుమారుడు ఉన్నారు.
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం..
– భారత ఆఫ్రికా సంతతికి చెందిన అమెరికా పౌరురాలు
– ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు
– ఓ ఇండియన్ ఒరిజిన్ అమెరికన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతుండటం ఇదే తొలిసారి
– 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ జననం
– కమల తల్లిదండ్రులు డొనాల్డ్ జె హారిస్, శ్యామలా గోపాలన్
– కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు
– తమిళనాడుకు చెందిన శ్యామలా 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లారు
– 25ఏళ్ల వయసులో డాక్టరేట్ పూర్తి చేసి చెస్ట్ క్యాన్సర్ పై పరిశోధనలు జరిపారు శ్యామల
* జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ ను వివాహం చేసుకున్న శ్యామల
– డొనాల్డ్, శ్యామల తొలి సంతానమే కమలా హారిస్, రెండో సంతానం మాయ
– కమలా హారిస్ తల్లిదండ్రులు 1972లో విడిపోయారు
– కమలా హారిస్ ఎక్కువగా తల్లి దగ్గరే పెరిగారు
– భారతీయ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు
– పలుమార్లు తల్లితో కలిసి చెన్నైకి కూడా వచ్చారు కమల
* 2009లో తల్లి చనిపోయినప్పుడు ఆమె అస్తికలను బంగాళాఖాతంలో కలిపేందుకు ఇండియాకు వచ్చారు కమల
– పౌర హక్కుల ఉద్యమం ప్రాముఖ్యత గురించి చిన్నప్పటి నుంచి కమలకు ఆమె తల్లి నేర్పించారు
– క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు
– అటార్నీ జనరల్ గా పని చేశారు
– 2016లో అమెరికా సెనేటర్ గా గెలిచారు
– ఆమె కాంగ్రెస్ లోకి వచ్చిన సమయంలో ట్రంప్ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు
– మూడేళ్ల తర్వాత అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోపం ప్రయత్నాలు చేశారు హారిస్. కానీ సక్సెస్ కాలేదు
– డెమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ రేసులో గెలిచిన బైడెన్.. హారిస్ ను తన రన్నింగ్ మేట్ గా ఎంచుకున్నారు
– వారిద్దరూ ట్రంప్, మైక్ లను ఓడించగల సత్తా ఉన్న నేతలుగా నిరూపించుకున్నారు
– 2024 అధ్యక్ష రేసులోకి ఆలస్యంగా ఎంటర్ అయ్యారు
– బైడెన్ తప్పుకోవడంతో పోటీలోకి వచ్చారు కమల
– అధ్యక్ష పదవికి నామినేట్ అయిన మొదటి నల్లజాతి ఏషియన్ అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు.
ఇలా ట్రంప్, హారిస్.. ఇద్దరూ.. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మరిప్పుడు వైట్ హౌస్ రేసులో ఎవరు ఎవరిని పడగతారో చూడాలి.
Also Read : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్ Vs కమల.. ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు లాభం?