German tattoo artist Shani Louk : హమాస్ మరో దారుణం…జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్‌ను కిడ్నాప్ చేసి ఏం చేశారంటే…

గాజాలో హమాస్ ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ ను అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

German tattoo artist Shani Louk

German tattoo artist Shani Louk : గాజాలో హమాస్ ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. జర్మన్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్ ను అత్యంత దారుణంగా తల నరికి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. హమాస్ ఉగ్రవాదులు షానీలౌక్ ను గాజా వీధుల్లో ఊరేగించి తల నరికి చంపారని ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు యిట్జాక్ హెర్జోగ్ వెల్లడించారు.

Also Read : Siddipet CP Swetha : కొత్త ప్రభాకర్ రెడ్డి ఘటనపై సిద్దిపేట సీపీ శ్వేత

‘‘షాని నికోల్ లౌక్ హత్యకు గురయ్యారని మాకు ఇప్పుడు వార్తలు అందినందుకు చింతిస్తున్నాను. ఆమె పుర్రెను కనుగొన్నాం. ఇది అనాగరిక, క్రూరంగా జంతువుల్లా ఆమె తలను నరికివేశారు’’ అని జర్మన్ అధ్యక్షుడు చెప్పారు. హమాస్ ఉగ్రవాదులు యువ జర్మన్-ఇజ్రాయెల్ టాటూ ఆర్టిస్ట్ షానీ లౌక్, కిబ్బట్జ్ రీమ్‌లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లారు.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

గాజా-ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని కబేళా వీధిలో రక్తం ప్రవహించడాన్ని తాము చూశామని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ ఉగ్రవాదులు బందీల్లో కొందరిని క్రూరంగా కాల్చివేసి ఛిద్రం చేయడంతో వారి గుర్తింపు ప్రక్రియకు సమయం పట్టిందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్పారు.

Also Read : Harish Rao : గన్‌మెన్ అలర్ట్‌గా లేకపోయుంటే ఊహించని ఘోరం జరిగేది- హరీశ్ రావు

23 ఏళ్ల టాటూ ఆర్టిస్ట్ కుటుంబం కూడా ఆమె మరణాన్ని అంతకుముందు రోజు ధృవీకరించింది. హమాస్ ఉగ్రవాదులు చిరిగిన బట్టలతో ఉన్న మహిళపై ఉమ్మివేసి కొట్టినట్లు వీడియోలో చూపించారని ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. షానీ క్రెడిట్ కార్డు గాజాలో ఉపయోగించారని కూడా తేలింది.

Also Read : Celebrity Look : కొత్త ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాని హీటేక్కిస్తున్న ముద్దుగుమ్మలు..

నెగెవ్ ఎడారి సంగీత ఉత్సవంలో ట్రైబ్ ఆఫ్ నోవా డ్యాన్స్ రేవ్ జరిగిన ప్రదేశంలో 260 మందికి పైగా మరణించారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ దేశంలో 1400మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైనిక దళాలు గాజా స్ట్రిప్ పై జరిపిన దాడుల్లో 8వేలమందికి పైగా మరణించారు.

ట్రెండింగ్ వార్తలు