Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. Arvind Kejriwal

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలనం.. ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు, విచారణకు రావాలని ఆదేశం

ED Notices To Arvind Kejriwal

ED Notices To Arvind Kejriwal : దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ (ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్) నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది ఈడీ. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో దర్యాఫ్తును వేగవంతం చేసింది ఈడీ. ఇందులో భాగంగానే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. లిక్కర్ పాలసీ రూపకల్పన, మనీలాండరింగ్ ఆరోపణలు, ముడుపుల వ్యవహారాలపై కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Also Read : హత్యా రాజకీయాలు వద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు- ప్రభాకర్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్

మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగినట్లు సుప్రీంకోర్టు ఇవాళ(అక్టోబర్ 30) అవగాహనకు వచ్చింది. ఈ ఉదయం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 6-8 నెలల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 16న అరవింద్ కేజ్రీవాల్ ను తొమ్మిదిన్నర గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. సాక్షిగానే అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరా పర్యవేక్షణలో కేజ్రీవాల్ స్టేట్ మెంట్ రికార్డు చేశాన అధికారులు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా 8 నెలలుగా తీహార్ లో జైల్లో ఉన్నారు. ఇక అక్టోబర్ 4న లిక్కర్ కేసు మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.