Godzilla Ramen : “గాడ్జిల్లా రామెన్” ఇంటర్నెట్‌ను భయపెడుతున్న వంటకం

"గాడ్జిల్లా రామెన్" అంట.. తైవాన్ కొత్త వంటకం.. చూడటానికి భయం వేస్తున్న దీనిని రుచి చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి మరి. కొత్త కొత్త వంటకాలు చూసి.. వాటి పేర్లు విని ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు.

Godzilla Ramen

Godzilla Ramen : ఈ మధ్యకాలంలో రకరకాల ఫుడ్ కాంబినేషన్లు జనాల్ని భయపెడుతున్నాయి. కొన్ని కాంబినేషన్లు తింటే ఏమౌతుందో అని ఫుడ్ లవర్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఇంటర్నెట్‌ను షాక్‌కి గురి చేస్తూ ఓ తైవానీస్ రెస్టారెంట్ వంటకం ఒకటి బయటకు వచ్చింది. ‘గాడ్జిల్లా రామెన్‌’గా పిలువబడే ఆ వంటకంలో మొసలి కాలు చూసి జనానికి వణుకు పుట్టింది.

Tomato ice cream : ‘టొమాటో ఐస్ క్రీం’ కొత్త ఫుడ్ కాంబినేషన్ .. ‘రిప్ టొమాటో’ అంటున్న నెటిజన్లు

ఏదైనా వింత అంటే చాలు సోషల్ మీడియాలో కనిపించాల్సిందే. తైవానీస్ రెస్టారెంట్ చేసిన ఓ వంటకం విచిత్రంగా, వికారంగా కనపడుతూ ప్రజాదరణ పొందింది. ‘గాడ్జిల్లా రామెన్’ అని పిలువబడే ఈ వంటకంలో మొసలి కాలు కనిపిస్తుంది. మొసలి కాలును ఆవిరి చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారట. ఈ వంటకంలో 40 రకాల మసాలాలు వాడతారట. తైవాన్ నుంచి వంటలు వైరల్ కావడం ఇది మొదటిసారి కాదు. కానీ చూడటానికి భయం కలిగించేలా ఉన్న ఈ వంటకంపై నెటిజన్లు తమ స్పందనలు తెలిపారు.

Paan Burger : ‘పాన్ బర్గర్ అంట’.. కొత్త కాంబినేషన్ చూసి మండిపడుతున్న ఫుడ్ లవర్స్

ఇలాంటి వంటకాలు అక్కడ ఫేమస్ అయినా.. ఇండియాలో కూడా రకరకాల ఫుడ్ కాంబినేషన్లు జనాన్ని భయపెడుతున్నాయి. అసలు కొన్ని కాంబినేషన్లు విషపూరితం అవుతాయని ఫుడ్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు. అయినా వైరల్ అవ్వాలనే కోరికతో కొందరు ఈ కాంబినేషన్లు తయారు చేయడం మాత్రం ఆపట్లేదు. ఏది ఏమైనా వెరైటీ ఫుడ్ చూడటమే కానీ.. రుచి చూడటానికి కాస్త ఆలోచించడమే బెటర్.