Jessie Lemonier: క్రీడారంగంలో విషాదం.. పాతికేళ్లకే మరణించిన ఫుట్‌బాలర్… గర్భంతో ఉన్న ప్రేయసి
పాతికేళ్లకే అమెరికా జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మరణించాడు. జెస్సీ లెమోనియర్ అనే స్థానిక స్టార్ ప్లేయర్ మంగళవారం మరణించినట్లు అతడి ప్రతినిధి డ్ర్యూ స్మిత్ వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ప్రేయసి గర్భిణిగా ఉంది. కొద్ది వారాల్లోనే బిడ్డను ప్రసవించబోతుంది.
- Narender Thiru
- Published On : January 27, 2023 / 04:43 PM IST
Jessie Lemonier: అమెరికా క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది. పాతికేళ్లకే అమెరికా జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మరణించాడు. జెస్సీ లెమోనియర్ అనే స్థానిక స్టార్ ప్లేయర్ మంగళవారం మరణించినట్లు అతడి ప్రతినిధి డ్ర్యూ స్మిత్ వెల్లడించాడు. ప్రస్తుతం అతడి ప్రేయసి గర్భిణిగా ఉంది.
Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్‌కు 259కు పడిపోయిన కరెన్సీ
కొద్ది వారాల్లోనే బిడ్డను ప్రసవించబోతుంది. ఇంతలోనే జెస్సీ మరణవార్త ఆమెను కుంగదీస్తోంది. జెస్సీ.. అమెరికాలో నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ జట్టుకు చెందిన డెట్రాయిట్ లయన్స్ జట్టుకు ఆడేవాడు. అతడి మృతిపై జట్టు సభ్యులు విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అయితే, జెస్సీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వచ్చే మంగళవారం జెస్సీ 26వ పుట్టిన రోజు.
తన బర్త్ డేకి వారం రోజుల ముందే అతడు మరణించాడు. చిన్నప్పట్నుంచి ఫుట్‌బాల్ ఆటలో మంచి నైపుణ్యం సంపాదించిన జెస్సీ 2020లో యూనివర్సిటీ విద్య పూర్తైన తర్వాత లాస్ ఏంజెల్స్ జట్టు తరఫున ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారారు. తర్వాత వివిధ జట్ల తరఫున ఆడిన జెస్సీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
