Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్‌కు 259కు పడిపోయిన కరెన్సీ

అంతర్జాతీయ మార్కెట్లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మెరుగపడదు.

Pakistani rupee: భారీగా పతనమైన పాకిస్తాన్ రూపాయి… డాలర్‌కు 259కు పడిపోయిన కరెన్సీ

Pakistani rupee: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. పొరుగు దేశం శ్రీలంకలాగే దివాళా దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుత అంచనా ప్రకారం పాకిస్తాన్ రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పాక్ రూపాయి విలువ 259కు చేరింది.

Taraka Ratna: తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ క్లారిటీ..!

దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పాక్ రూపాయి మారకం విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. ప్రస్తుత పాక్ ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా మిత్ర దేశం ఆదుకోవడమో, లేక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం రావడమో జరిగితే తప్ప ఇప్పటికిప్పుడు పాక్ పరిస్థితి మెరుగపడదు. లేకుంటే పాక్ పూర్తిగా దివాళా ప్రకటించడమే. అయితే, ఐఎమ్ఎఫ్ నుంచి రుణం పొందడంలో పాక్ విఫలమైంది. దీంతో పాక్ కరెన్సీ మరింత పతనమైంది. గురువారం పాక్ కరెన్సీ 7 శాతం తగ్గగా, శుక్రవారం 4.2 శాతం తగ్గింది. దీంతో డాలర్‌తో పాక్ రూపాయి విలువ 259.7కు చేరింది. ఐఎమ్ఎఫ్ నుంచి పాక్ 6.5 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని కొన్ని నెలలుగా కోరుతోంది.

Viral Video: గోల్డ్ ఫిష్‌ ప్రాణాలు కాపాడిన కుక్క.. అబ్బురపరుస్తున్న వీడియో

అయితే, ఈ ప్యాకేజీ రాకపోవడంతో పాక్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుడం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సంకటంగా మారింది. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగానూ తీవ్ర ఇబ్బంది పడుతోంది షరీఫ్ ప్రభుత్వం. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరెంటు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన నగరాలు కూడా కరెంటు కోతతో అల్లాడుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రిపూట మాత్రమే కరెంటు సరఫరా ఉంటోంది. పగలంతా కరెంటు కోతలే విధిస్తున్నాయి. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ఎక్కువ ఖరీదు పెట్టి కొనేందుకు సిద్ధమైనప్పటికీ మార్కెట్లో సరుకులు దొరకని పరిస్థితి.