Viral Video: గోల్డ్ ఫిష్ ప్రాణాలు కాపాడిన కుక్క.. అబ్బురపరుస్తున్న వీడియో
ఇళ్లలో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే చిన్ని చేపలు మరింత సున్నితంగా ఉంటాయి. ఓ ఇంట్లోని వారు గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటున్నారు. అందులో నుంచి ఓ గోల్డ్ ఫిష్ నేలపై పడిపోయింది. దీంతో దాన్ని ఓ పిల్లి చూసింది. అయితే, గోల్డ్ ఫిష్ ను తిరిగి నీటిలో వేయలేకపోయింది. అదే సమయానికి అక్కడకు వచ్చిన పెంపుడు కుక్క ఆ గోల్డ్ ఫిష్ ను నోటితో కరుచుకుని నీటిలో వేసింది. దీంతో ఆ గోల్డ్ ఫిష్ హాయిగా నీటిలో ఈదింది.

Viral Video: మనుషులే కాకుండా జంతువులు, పశువులు కూడా జాలి, దయ కలిగి ఉంటాయి. అందులో కుక్కలను విశ్వాసం ఎక్కువ. తెలివీ ఎక్కువేనని పలు సందర్భాల్లో శునకాలు నిరూపించుకుంటాయి. తాజాగా. ఓ గోల్డ్ ఫిష్ ప్రాణాలను కాపాడింది ఓ కుక్క. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చేపలు నీటిలో నుంచి బయటపడితే కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోతాయి.
ఇళ్లలో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే చిన్ని చేపలు మరింత సున్నితంగా ఉంటాయి. ఓ ఇంట్లోని వారు గోల్డ్ ఫిష్ లను పెంచుకుంటున్నారు. అందులో నుంచి ఓ గోల్డ్ ఫిష్ నేలపై పడిపోయింది. దీంతో దాన్ని ఓ పిల్లి చూసింది. అయితే, గోల్డ్ ఫిష్ ను తిరిగి నీటిలో వేయలేకపోయింది. అదే సమయానికి అక్కడకు వచ్చిన పెంపుడు కుక్క ఆ గోల్డ్ ఫిష్ ను నోటితో కరుచుకుని నీటిలో వేసింది. దీంతో ఆ గోల్డ్ ఫిష్ హాయిగా నీటిలో ఈదింది.
ఈ వీడియోను గాబ్రియేల్ హార్న్ అనే ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అది బాగా వైరల్ అయింది. మన జీవితంలో మనకు ఓ జంతువు తోడుగా ఉంటే అదే మనల్ని ఉత్తమ మనిషిగా తీర్చిదిద్దుతుందని అనుకుంటున్నానని హార్న్ పేర్కొన్నాడు. చేపను కాపాడి ఆ కుక్క చూపించిన దయకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
I think having an animal in our life makes us better humans pic.twitter.com/w1TGuiEsiz
— Gabriele Corno (@Gabriele_Corno) January 26, 2023
‘Pariksha Pe Charcha’ 2023: పరీక్షల్లో ‘చీటింగ్’పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు