Google Smart Glasses Prototype That Translates Languages In Real Time
Google prototype that translates languages in real time : మీకు.. మీ మదర్‌టంగ్ (మాతృభాష)తప్ప.. మరో భాష రాదా.? ఇతర భాషలు.. అర్థం చేసుకోవడం మీ వల్ల కావడం లేదా? అయితే.. ఇకపై స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులనో.. 30 రోజుల్లో పలానా భాష నేర్చుకోవచ్చనే పుస్తకాలనో పట్టుకోవాల్సిన పనిలేదు. జస్ట్.. ఆ గ్లాసెస్ పెట్టుకుంటే చాలు. అవతలి వ్యక్తి.. ఏ భాషలో మాట్లాడినా.. మీకు.. అర్థమయ్యే భాషలో ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. దాని వల్ల.. కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. వినడానికి.. చాలా కొత్తగా ఉంది కదా. చూడడానికి.. ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయిపోయింది మరి..
గూగుల్ నుంచి కొత్తగా ఓ ప్రొడక్ట్ వచ్చింది. అదే.. స్మార్ట్ గ్లాసెస్. దీనిని.. గూగుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్.. యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో.. సీఈవో సుందర్ పిచాయ్.. రివీల్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. అదొకసారి చూద్దాం..అర్థమవుతోందా.. ఈ ప్రోటోటైప్ స్మార్ట్ గ్లాసెస్.. రియల్ టైమ్‌లో లాంగ్వేజెస్‌ని ట్రాన్స్ లేట్ చేసి.. మీ కళ్ల ముందు చూపిస్తుంది. అంటే.. అవతలి వ్యక్తి ఏ భాషలో మాట్లాడినా.. అది మీకు అర్థమయ్యే భాషలో.. మీ కళ్ల ముందే కనిపిస్తుందన్నమాట.
Also read : Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..
గూగుల్ పదేళ్ల కిందటే.. ఇలాంటి స్మార్ట్ గ్లాసెస్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. కానీ.. కొన్ని కారణాల వల్ల అది లేటైపోయింది. ఇప్పుడు మళ్లీ.. కాస్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని యాడ్ చేసి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు.. ఈ గ్లాసెస్ లోపలే ప్రోగ్రామ్ చేయబడిన గూగుల్ అసిస్టెంట్‌తో.. ఈ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ రానున్నట్లు కనిపిస్తోంది. ఈ కళ్లద్దాలు.. స్మార్ట్ స్టైల్‌లో కాకుండా.. నార్మల్‌గానే కనిపిస్తున్నాయ్. కానీ.. కళ్ల ముందే.. అవతలి వ్యక్తి మాట్లాడే భాషను.. ట్రాన్స్ లేట్ చేసి మీ కళ్లముందు ప్రత్యక్షం చేస్తాయి.
ఈ ఆగ్‌మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ ధరించిన ఎవరైనా.. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు.. కళ్ల ముందున్న లెన్స్ మీద సబ్ టైటిల్స్ చదవడం ద్వారా.. మరో వ్యక్తి ఏం చెబుతున్నారో అర్థం చేసుకునేందుకు వీలుంటుంది. ప్రపంచంలోని ఏ భాషనైనా ట్రాన్స్ లేట్ చేసేలా.. వీటిని తయారుచేశారు. ఇంటర్నేషనల్ టూర్స్‌కి వెళ్లినప్పుడు.. అక్కడి స్థానికుల భాష తెలియదు. వాళ్లేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడం కష్టం. కానీ.. ఈ గ్లాసెస్ పెట్టుకుంటే ఆ సమస్య ఉండదు. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో.. మీ కళ్లముందు అక్షరాల రూపంలో కనిపించేస్తాయ్.
Also read : Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..
అయితే.. ఈ గూగుల్ గ్లాసెస్ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తాయన్నదానిపై.. క్లారిటీ లేదు. ఈ ప్రోటోటైప్ ఆగ్‌మెంటెడ్ రియాలిటీ.. ఎక్కడ ఎక్కువ సహాయపడుతుందన్నది.. టెక్ దిగ్గజం గూగుల్ కూడా చెప్పలేదు. ఇక.. దీని రిలీజ్ డేట్, ధర కూడా ప్రకటించలేదు. అందువల్ల.. ఈ సరికొత్త ఆవిష్కరణ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.