beautiful moment : మనవరాలి సంతోషం కోసం ఓ తాతగారు చేసిన పని చూస్తే ముచ్చపడతారు

గ్రాండ్ పేరెంట్స్‌తో పిల్లల అనుబంధం అద్భుతంగా ఉంటుంది. చిన్నతనంలో వారు చెప్పే కథలు.. వారితో ఆడే ఆటలు ప్రతి ఒక్కరికి అందమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఓ తాతగారు.. తన మనవరాలి కోసం చేసిన ఓ పని హార్ట్‌ని టచ్ చేసింది.

beautiful moment

beautiful moment : బీచ్‌కి (beach) వెళ్లడం.. అక్కడ సముద్ర (sea) కెరటాల్ని ఆస్వాదించడం.. బీచ్ ఒడ్డున ఇసుక గూళ్లు కట్టడం.. గవ్వలు ఏరడం ఇవన్నీ ఇష్టపడని వారుంటారా? ఇక చిన్నపిల్లలు అయితే మరింత సరదా పడతారు. ఇక వారిని కంట్రోల్ చేయడం పెద్దవాళ్లకి పెద్ద పని. స్టోరిలోకి వస్తే ఓ తాతగారు తన మనవరాలితో కలిసి బీచ్ కి వెళ్లారు. అక్కడ జరిగిన ఓ సంఘటన మనసుని టచ్ చేసింది.

Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

ఓ తాతగారితో మనవరాలు బీచ్ కి వెళ్లింది. ఇక ఆ చిన్నదానికి సంబరాన్ని మాటల్లో చెప్పలేం కదా.. ఫ్యామిలీ మొత్తం గవ్వల (shell) వేట మొదలుపెట్టారు. చిన్నారి కూడ గవ్వల కోసం వెతకడం మొదలుపెట్టింది. చిన్నది దానికేం కనిపిస్తాయి. ఆమెను నిరుత్సాహ పరచకూడదనుకున్న తాతగారు ఆల్రెడీ ఆయన వెతికి పట్టుకున్న గవ్వలన్నీ తన మనవరాలి కంటపడేలా బీచ్ ఒడ్డున పడేశాడు. ఇక ఆ చిన్నారి తనకే గవ్వలు దొరుకుతున్నట్లు తెగ సంబరపడిపోయింది. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనవరాలిని సంతోషపరచడానికి ఆ తాతగారు చేసిన పని చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు.

intelligent elephant : అరటిపండు తొక్క వొలిచి తింటున్న ఏనుగు వీడియో వైరల్

ఇక ఈ వీడియో చూసిన వారంతా క్యూట్ వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మా తాతగారైతే టన్నుల కొద్దీ చాక్లెట్ బార్లు వదిలిపెడతారని.. తమ పేరెంట్స్ కూడా ఇలాగే చేసేవారని తమ అనుభవాల్ని పంచుకున్నారు.