స్వీడన్ బాలిక, ప్రముఖ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్(17)… మళ్లీ స్కూల్ బాట పట్టింది. ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రచారం నిర్వహించిన ఆ బాలిక మళ్లీ చదువుల వైపు మళ్లింది.
తిరిగి మళ్లీ టీనేజ్ చదువులకు వెళ్లడం సంతోషంగా ఉన్నట్లు గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేసింది. స్కూల్ గ్యాప్ ముగిసిపోయిందని, మళ్లీ స్కూల్‌కు వెళ్లడం గొప్ప ఫీలింగ్‌ను ఇస్తున్నట్లు ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నది.
గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీలో గ్రేటా థన్‌బర్గ్ తన ప్రసంగంతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాధినేతలను గ్లోబల్ వార్మింగ్ అంశంపై హౌ డేర్ యూ అంటూ నిలదీసింది. వాతావరణం వేడెక్కడానికి నేతల నిర్ణయాలే కారణమంటూ ఆమె ఆరోపించింది. అయితే కరోనా నేపథ్యంలో గ్రెటా ప్రచారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఉన్నత చదవులను పూర్తి చేసేందుకు రెఢీ అయ్యింది.
కాగా, గతేడాది గ్రేటా థంబెర్గ్‌కు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పులపై ఆమె సాగించిన పోరాటం ప్రపంచం మొత్తం మీద స్కూలు పిల్లల్లో చైతన్య కలిగించినందుకు ఈ బహుమతి లభించింది. గతేడాది డిసెంబర్ లో టైమ్స్ మేగజైన్ ఏటి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా థన్‌బెర్గ్‌కు పట్టం కట్టింది.ఈ 17 ఏళ్ల అమ్మాయి ముఖచిత్రంతో మేగజైన్
వెలువరించింది.
My gap year from school is over, and it feels so great to finally be back in school again! pic.twitter.com/EKDzzOnwaI
— Greta Thunberg (@GretaThunberg) August 24, 2020