ల్యాబ్‌లో పెరిగే కృత్రిమ కలప.. భవిష్యత్తులో ఫర్నీచర్ ఇదే..! అటవీ నిర్మూలన అరికట్టే కొత్త పద్ధతి!

ల్యాబ్ లో పెరిగే చెట్ల ద్వారా వచ్చే కలపతో భవిష్యత్తులో ఫర్నీచర్ తయారీకి ఉపయోగ పడుతుందని అంటున్నారు. అటవీ నిర్మూలనను కూడా అరికట్టనట్టవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు.

Grow wood in a lab : వాతావరణంలో పెనుమార్పులకు అటవీ నిర్మూలనే కారణమనే ఇప్పటికే పర్యావరణ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ భూమల కోసమో ఇతర కార్యకలాపాల కోసమో అడవులను నరికేస్తున్న పరిస్థితి.పర్నిచర్ తయారీకి కలప కోసం అటవీ వనరులపై ఆధారపడుతున్నారు. అడవులను నరికేస్తున్నారు. దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో హానికర ఉద్గారాలు పెరిగి పర్యావరణ తీవ్ర కాల్యుషానికి కారణమవుతోంది. అటవీ సంపదపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా సైంటిస్టులు ఓ కొత్త దారి కనుగొన్నారు. ఈ కొత్త పద్ధతి ద్వారా ల్యాబరేటరీలోనే కృతిమ కలపను సృష్టిస్తున్నారు.

ల్యాబ్ లో పెరిగే చెట్ల ద్వారా వచ్చే కలపతో భవిష్యత్తులో పర్నిచర్ తయారీకి ఉపయోగ పడుతుందని అంటున్నారు. అంతేకాదు.. అటవీ నిర్మూలనను కూడా చెక్ పెట్టేసినట్టు అవుతుందని అమెరికాలోని ఎంఐటీ రీసెర్చర్లు భావిస్తున్నారు. ల్యాబ్ లో పెరిగే ఈ కలపకు సూర్యరశ్మి లేదా మట్టిపై ఆధారపడాల్సి అవసరం లేదు. అరుదుగా దొరికే ఓ మొక్క ద్వారా ఈ కలపను సైంటిస్టులు సృష్టిస్తున్నారు. ల్యాబ్ లో వృద్ధిచెందే మాంసం మాదిరిగానే ఈ కృత్రిమ కలప పెరుగుతుంది.

మిమిక్ వుడ్ అనే మొక్కల కణజాలల నుంచి కొన్ని నిర్మాణాలను సేకరించారు. ఈ కణజాలాలు చెట్ల నుంచి వచ్చినవి కాదు.. మెక్సికో లో పెరిగే జిన్నియా అనే పిలిచే పూల మొక్క.. ఈ మొక్క నుంచి సేకరించిన కణజాలంలోని హార్మోన్ల ద్వారా ల్యాబ్ లో చెట్ల కలపను పెంచవచ్చునని సైంటిస్టులు పరిశోధనలో గుర్తించారు. ఈ జిన్నియా ప్లాంట్ చాలా వేగంగా పెరుగుతుందని అధ్యయనంలో తేల్చేశారు.

దీన్ని ఒక జెల్ గా అభివృద్ధి చేయడానికి ముందుగా కణాలను పునరుత్పత్తి చేస్తారు. ఒకసారి ఈ కణాలు పెరిగిన తర్వాత వివిధ వేరిబుల్ అయిన పీహెచ్, హార్మోన్ కేంద్రీకరణతో పరీక్షించి చూస్తారు. బయోమెటేరియల్ ప్రొడక్షన్‌కు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఈ కొత్త పద్ధతి ద్వారా అటవీ, వ్యవసాయంతో పర్యావరణంపై ప్రభావం తగ్గుతుంది. తద్వారా అడవులు నిర్మూలన అరికట్టడం సాధ్యపడుతుంది.

1990 నుంచి 2016 మధ్య కాలంలో కలప వినియోగం ఎక్కువగా పెరగడం కారణంగా 5 లక్షల చదరపు మైళ్ల వరకు అడవులను కోల్పోవాల్సి వచ్చింది. వ్యవసాయ భూముల కోసం అడవులన్నీ తుడుచుపెట్టుకుపోయాయి.

ఈ కొత్త తరహా పద్ధతి ద్వారా అడవుల నిర్మూలనను అరికట్టవచ్చు.. కలప కోసం అటవీ సంపదపై ఆధారపడాల్సిన అవసరం పడదు. ల్యాబ్ లో పెరిగే ఈ కృత్రిమ కలప ద్వారా అవసరమైన ఫర్నీచర్ తయారీకి వినియోగపడొచ్చునని రీసెర్చర్లు అంటున్నారు.