Hair Style
New Hair Style:మహిళలు జట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. శుభకార్యాలు, పలు షోలు, ఈవెంట్లు, ఇలా ప్రత్యేక కార్యక్రమాలకు, ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తమ జట్టును పలురకాల స్టైల్స్‌లో ఆకర్షనీయంగా అలంకరించుకుంటారు. ఇక హెయిర్ స్టైలిస్ట్‌లు అయితే, మగువల మనస్సులు దోచేలా కొత్తకొత్త స్టైల్స్‌ను ఆవిష్కరిస్తుంటారు. తాజాగా ఓ ప్రఖ్యాత సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ తన ప్రతిభతో ఓ మహిళ తలపై ఏకంగా క్రిస్మస్ ట్రీనే రూపొందించాడు. ఫలితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Yuvraj Hairstyle : యువరాజ్ కిర్రాక్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
డానీ హిస్వానీ ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. పలుసార్లు అనేక విధాలైన హెయిర్ స్టైలిస్‌తో పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. హిస్వాని ప్రపంచ మ్యాగజైన్‌లతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ దీపిక పదుకొనే, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్పగొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా డానీ హిస్వానీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఓ మోడల్ తలపై 2.90 మీటర్ల ( 9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ ట్రీ ఆకారంలో జట్టును అలంకరించాడు.
హిస్వానీ తొలుత మోడల్ తలకు సపోర్ట్ గా హెల్మెంట్ ను పెట్టాడు. దానిపై మూడు మెటల్ రాడ్‌లు అమర్చి జుట్టును క్రిస్మస్ ట్రీ ఆకారంలో వచ్చేందుకు విగ్ లు, హెయిర్ ఎక్స్‌టన్షన్‌ను ఉపయోగించాడు. దీంతో 2.90 మీటర్ల ఎత్తైన కేశాలంకరణతో గిన్సిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. సెప్టెంబర్ 16న దుబాయ్ లో జరిగిన ఈవెంట్ లో ఈ రికార్డును సాధించాడు. అయితే, హిస్వానీ హెయిర్ స్టైలింగ్ ను కేవలం వృత్తిగానే కాకుండా ఒక కళారూపంగా భావిస్తాడు. ఫ్యాషన్ పరిశ్రమలోకి ప్రవేశించిన ఏడు సంవత్సరాల క్రితం జుట్టుతో తన ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించాడు. తాజా రికార్డు పొందిన వీడియోను గిన్సీస్ బుక్ ఆప్ వరల్డ్ అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కొన్నిగంటల్లోనే 7.36లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించి, అభినందిస్తున్నారు.