Yuvraj Hairstyle : యువరాజ్ కిర్రాక్ లుక్‌, ఫ్యాన్స్ ఫిదా

ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు.

Yuvraj Hairstyle : యువరాజ్ కిర్రాక్ లుక్‌, ఫ్యాన్స్ ఫిదా

Yuvi

Updated On : March 27, 2021 / 2:13 PM IST

yuvisofficial : ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. యువీ తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సరికొత్త లుక్‌లో యువీ పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో కనిపిస్తాడు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నాయి.

యూవీ ఫొటోలకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున లైక్‌లు కొడుతూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ తాజా పోస్ట్ పై టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. భాయ్ బాద్ షా లా మారిపోయావ్ అంటూ ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా తదితరులు కామెంట్ చేశారు.

తాజాగా ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో యువీ.. తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తూ ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సిరీస్‌లో యువీ.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 170 స్ట్రయిక్‌ రేట్‌తో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో యువీ మొత్తం 17 సిక్సర్లు బాదాడు. టోర్నీ మొత్తంలో యువీనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. చివరికి భారత లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు యువరాజ్‌సింగ్.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)