Man Lifting
man lifting 63 kg woman using beard : ఒక వృద్ధుడు తన గడ్డంతో 63 కేజీల మహిళను పైకి ఎత్తాడు. అంటనాస్ కాంట్రిమాస్ అనే వ్యక్తి తన గడ్డంకు ఉన్న జుట్టుకు కట్టిన 63.80 కేజీ బరువున్న మహిళను ఏ సపోర్టు తీసుకోకుండా పైకి ఎత్తాడు. మహిళను పైకి ఎత్తేటప్పుడు అతని ముఖంలో బాధ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఆ బాధంతా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికే భరించానని అంటున్నాడు. దీంతో గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటి వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Special Exams : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, స్పెషల్ ఎగ్జామ్స్ లేనట్లే..!
సోషల్ మీడియాలో ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు, లక్షల్లో కామెంట్లతో వైరల్ అవుతోంది. ఇది నిజంగా చాలా అద్భుతం, భిన్నమైన ప్రతిభ అని ఒకరు, ఇతని వెంట్రుకలు దేనితో తయారు చేయబడ్డాయో.. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఏదేమైనా అతని గడ్డం గురించి నెట్టింట చర్చలు కొనసాగుతున్నాయి.