Special Exams : ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, స్పెషల్‌ ఎగ్జామ్స్‌ లేనట్లే..!

కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. కరోనా సోకిన విద్యార్థులు లేకపోవడంతో ప్రస్తుతానికి స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించడంలేదని తెలిపింది.

Special Exams : ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, స్పెషల్‌ ఎగ్జామ్స్‌ లేనట్లే..!

Intermediate

Intermediate Board clarify : కరోనా బాధితులకు ప్రత్యేకంగా పరీక్షలు పెట్టే అంశంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత ఇచ్చింది. కరోనా సోకిన విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ప్రస్తుతానికి స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత నెలలో ఇంటర్మీడియట్ సెకండియర్‌లోని విద్యార్థులకు ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.

అయితే కరోనా బారినపడ్డ విద్యార్థులను పరీక్షకు అనుమతించామని, అలాంటి వారుంటే స్పెషల్‌ ఎగ్జామ్స్‌ పెడతామని అప్పట్లోనే ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక పరీక్షల కోసం విద్యార్థులెవరూ తమను సంప్రదించాలని తెలిపింది. తాజాగా పరీక్షలు ముగియడం, ఈ నెలాఖరున ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.

ESI IMS Scam : ఈఎస్‌ఐ ఐఎంఎస్‌ స్కామ్‌..రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ఈ నేపథ్యంలో కరోనా బారినపడ్డ విద్యార్థులెవరూ ప్రత్యేక పరీక్ష కోసం ఇంటర్‌ బోర్డును సంప్రదించలేదు. దీంతో స్పెషల్‌ పరీక్షను నిర్వహించే ఆలోచనేది లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పేర్కొన్నారు. వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అంశంపైన కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆయా పరీక్షలకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జరపబోమని తెలిపారు. ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులందరికీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, ఇప్పుడు పరీక్షలను నిర్వహించేందుకు సమయం సరిపోకపోవడంతో ఈ అంశాన్ని పక్కనపెట్టారు.