Guinness World Record : 160 కి.మీ నిద్రలో నడిచిన బాలుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వింత స్టోరి

నిద్రలో నడిచే అలవాటు కొందరిలో ఉంటుంది. అయితే ఓ బాలుడు ఏకంగా 160 కిలోమీటర్లు నిద్రలో నడిచాడు. ఈ వింత స్టోరీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. ఆ బాలుడి పేరుతో రికార్డు కూడా నమోదు చేసింది.

Guinness World Record : 160 కి.మీ నిద్రలో నడిచిన బాలుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసిన వింత స్టోరి

Guinness World Record

Guinness World Record : నిద్రలో నడిచే అలవాటు కొందరిలో ఉంటుంది. ఇంటి వరకూ..ఇంటి పరిసరాల వరకూ నిద్రలో నడిచిన వారి గురించి విని ఉండచ్చు. కానీ ఓ బాలుడు ఏకంగా నిద్రలో 160 కి.మీ నడిచేసాడు. 36 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వింత ఘటనను తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది.

Elisabeath Guinness Record : 1600 లీటర్ల చనుబాలు దానం చేసిన అమ్మ, వేలాది చంటిబిడ్డల కడుపు నింపిన మాతృమూర్తికి దక్కిన గిన్నిస్ అవార్డ్

1987 ఏప్రిల్ 6 న 11 ఏళ్ల మైఖేల్ డిక్సన్ అనే బాలుడు అమెరికాలోని పెరూ, ఇండియానాలో రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతూ కనిపించాడట. చెప్పులు లేకుండా పైజామా మాత్రమే ధరించి ఉన్నాడట. తెల్లవారు ఝామున 2.45 గంటలకు అతడిని గుర్తించిన రైల్వే సిబ్బంది మైఖేల్ అసాధారణ స్థితి గుర్తించి పోలీసులకు తెలిపారట. పోలీసులు అతని అడ్రస్ ఆరా తీస్తే డిక్సన్ ఇల్లినాయిస్‌ లోని డాన్ విల్లే నుండి వచ్చానని చెప్పాడట. డిక్సన్ తన ఇంటికి సమీపంలోని స్టేషన్ నుండి గూడ్స్ రైలు ఎక్కి అర్ధరాత్రి అంత దూరం ప్రయాణించాడట. తనకు రైలు ఎక్కడం, దిగడం గుర్తు లేదని చెప్పాడట. నిద్రలో చేసిన ప్రయాణం అయినా డిక్సన్ మాత్రం క్షేమంగా ఉన్నాడట. మొత్తానికి ఇల్లినాయిస్ లోని తన ఇంటి నుంచి ఇండియానా వరకూ నిద్రలో ప్రయాణం చేసిన డిక్సన్ మాత్రం క్షేమంగా ఉన్నాడు.

shortest escalator : ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్‌కు గిన్నిస్ రికార్డ్

వెంటనే డిక్సన్ తల్లికి పోలీసులు అతని ఆచూకి తెలియజేశారు. వెంటనే ఆమె అతనిని తీసుకువెళ్లేందుకు వచ్చిందట. డిక్సన్ తల్లి అతనిని రాత్రి 10 గంటలకు చూసిందట. అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉన్నా ఇంటి బయటకు వస్తాడని ఎప్పుడూ అనుకోలేదని ఆమె చెప్పిందట. ఈ వింత కేసును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఖాతాలో నమోదు చేసుకోవడమే కాదు ఈ స్టోరిని స్వయంగా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.  కొన్ని సంవత్సరాలుగా నిద్రపోని వారిని, గురక శబ్దం చేసేవారిని, కలలు కనడం, ఆవులించడం, కోమా వంటివి నమోదు చేసిన గిన్నిస్ యాజమాన్యం  నిద్రలో నడవడం కూడా నమోదు చేసాము అని వెల్లడించింది. మొత్తానికి మైఖేల్ డిక్సన్ తనకున్న స్లీప్ వాక్ సమస్యతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఈ రికార్డును ఎవరు తిరగ రాస్తారో చూడాలి.