Hamas New Chief (Photo Credit : Google)
Hamas New Chief : ఇజ్రాయెల్ దాడిలో హతమైన యాహ్యా సిన్వార్ మృతితో హమాస్ నెక్ట్స్ చీఫ్ ఎవరనే దానికి దాదాపు తెరపడింది. హమాస్ కొత్త చీఫ్ గా ఖలీద్ మషాల్ ఎంపికైనట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో హమాస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న మషాల్.. సిన్వార్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు లెబనాన్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. యూఏఈ, ఈజిప్ట్, అమెరికా మధ్యవర్తిత్వంతో జరుగుతున్న గాజా కాల్పుల విరమణ చర్చల్లో ఇక నుంచి మషాల్ పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశాలకు హమాస్ నాయకత్వం తెలిపినట్లు వెబ్ సైట్ పేర్కొంది.
ఇజ్రాయెల్ దళాలు ఇటీవల సిన్వార్ ను ఖతం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హమాస్ కొత్త చీఫ్ ఎవరు అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు ఖలీద్ మషాల్. ఉగ్రవాద సంస్థ తదుపరి చీఫ్ ఇతడే అనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఎవరీ ఖాలద్ మషాల్. అతడి ప్రత్యేకత ఏంటి?
అనుభవజ్ఞుడైన ప్రచారకర్తగా గుర్తింపు పొందాడు మషాల్. ఖలీద్ మషాల్ 1956లో వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించిన వివాదాస్పద ప్రాంతంలో జన్మించాడు. అతను 15 సంవత్సరాల వయస్సులో పాన్-అరబ్ మిలిటెంట్ రాజకీయ సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్‌లో చేరాడు.
మషాల్.. సిన్వార్‌లా కాకుండా.. ఇస్మాయిల్ హనియేలా ఉంటాడని చెబుతారు. బాగా డబ్బు సంపాదించాడు. లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. నిత్యం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటాడు. గల్ఫ్ దేశాల్లో లగ్జరీ హోటల్స్ లో గడుపుతుంటాడు. మషాల్.. టేబుల్ టెన్నిస్ కు వీరాభిమాని. మంచి ఆహార ప్రియుడు కూడా. అత్యుత్తమ నగరాల్లోని పేరొందిన హోటల్స్ లో తరచుగా భోజనం చేస్తాడు.
Also Read : గాజా టన్నెల్లో కుటుంబ సభ్యులతో యాహ్యా సిన్వార్.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం