Yahya Sinwar: గాజా టన్నెల్లో కుటుంబ సభ్యులతో యాహ్యా సిన్వార్.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ గాజాలోని టన్నెల్ లో తన భార్య, పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.

Yahya Sinwar: గాజా టన్నెల్లో కుటుంబ సభ్యులతో యాహ్యా సిన్వార్.. వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

Hamas Chief Yahya Sinwar

Updated On : October 20, 2024 / 11:16 AM IST

Hamas Chief Yahya Sinwar In Gaza Tunnel Video: హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. సిన్వార్ ఉన్న భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి జరిపి హతమార్చింది. చనిపోయే ముందు డ్రోన్ కెమెరా వీడియోలో సిన్వార్ వీడియోను రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. ఆ వీడియోలో యాహ్యా సిన్వార్ ముఖానికి క్లాత్ కట్టుకొని శిథిలమైన భవనంలో గాయాలతో సోపాపై కూర్చొని ఉన్నాడు. డ్రోన్ కెమెరా రావడాన్ని చూసి తన చేతిలో కర్రను విసిరివేయడం వీడియోలో కనిపించింది. అయితే, తాజాగా మరో వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.

Also Read: Un Report: అత్యధిక పేదలున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ఎంత మంది పేదరికంలో జీవిస్తున్నారంటే?

గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై మెరుపుదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు.. దాదాపు 250 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లారు. ఈ దాడులకు సూత్రధారి యాహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల హతమార్చింది. అయితే, తాజాగా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన వీడియో.. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి కొన్ని గంటల ముందుది. ఈ వీడియోలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ గాజాలోని టన్నెల్ లోకి తన భార్య, పిల్లలతో కలిసి వెళ్తున్నాడు.

Also Read: వెనక్కి తగ్గని హమాస్-ఇజ్రాయెల్.. పశ్చిమాసియాలో యుద్ధం ఆగేదెప్పుడు?

అతడి భార్య, పిల్లలతో కలిసి టెలివిజన్, నీరు, దిండ్లు, పరుపులు వంటి వస్తువులను టన్నెల్లోకి తరలిస్తున్నట్లుగా వీడియోలో ఉంది. ఇది అతడి ఇంటి కింద ఏర్పాటు చేసుకున్న సొరంగం అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డానియల్ హగేరీ పేర్కొన్నారు. గత ఏడాది తమపై దాడులు చేసినప్పటి నుంచి సిన్వార్ ఈ సొరంగంలోనే ఎక్కువ సమయం గడిపినట్లు వెల్లడించారు. అక్కడ వారు ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలతో పాటు దళాల తనిఖీల్లో దొరికిన నగదు, పత్రాలకు సంబంధించిన ఫొటోలను విలేకరుల సమావేశంలో హగేరీ చూపించారు.