Un Report: అత్యధిక పేదలున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ఎంత మంది పేదరికంలో జీవిస్తున్నారంటే?
ప్రపంచ వ్యాప్తంగా 455 మిలియన్ల మంది పేదలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వారేనని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.

India Poverty
UN Report : ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు పేదరికంలో జీవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.1 బిలియన్ల మంది (సుమారు 101 కోట్లు) ప్రజలు తీవ్రమైన పేదరికంలో నివసిస్తున్నారని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పేదరికం కలిగిన ఐదు దేశాల్లో భారతదేశం ఐదో స్థానంలో ఉంది. భారత్ కంటే ముందు వరుసలో పాకిస్థాన్ (93 బిలియన్లు), ఇథియోపియా (86 మిలియన్లు), నైజీరియా (74 మిలియన్లు), డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (66 మిలియన్లు) మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో జీవిస్తున్న వారిలో ఈ ఐదు దేశాల్లోనే 48.1శాతం మంది ఉన్నారట.
Also Read: వెనక్కి తగ్గని హమాస్-ఇజ్రాయెల్.. పశ్చిమాసియాలో యుద్ధం ఆగేదెప్పుడు?
1.1 బిలియన్ల పేదలలో సగం మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు. 13.5 శాతం మంది 18ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. సగం మంది పేదలు పోషకాహార లోపంతో జీవిస్తున్నారు. 83.7శాతం మంది పేదలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని ఐక్య రాజ్య సమితి నివేదిక పేర్కొంది. మొత్తం మీద ప్రపంచ గ్రామీణ జనాభాలో 28.0 శాతం మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవనం సాగిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 6.6శాతం మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు.
Also Read: మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లేనా? ప్రపంచం ఇక రోజులు లెక్క పెట్టాల్సిందేనా?
ప్రపంచ వ్యాప్తంగా 455 మిలియన్ల మంది పేదలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని వారేనని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి జీవనంకోసం తరలివెళ్తున్నారు. తద్వారా వారి జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడి పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని యూఎన్డీపీ నిర్వాహకుడు అచిమ్ స్టైనర్ పేర్కొన్నారు.