New Year 2024: ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు.. ఫొటోలు, వీడియోలు చూస్తారా?

విద్యుద్దీపాల నడుమ, బాణసంచా కాల్చుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ ఆయా దేశాల ప్రజలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు.

Newzealand

కమ్మని కలలకు ఆహ్వానం పలుకుతూ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. 2023ను గతంలో కలిపేస్తూ 2024లో తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రజలు 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు.

ప్రపంచంలో మొదటగా నూతన సంవత్సరం మొదలయ్యే దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. వాటితో పాటు పలు దేశాల్లోనూ న్యూ ఇయర్ ప్రారంభమైంది. విద్యుద్దీపాల నడుమ, బాణసంచా కాల్చుతూ, డ్యాన్స్ చేస్తూ, కేరింతలు కొడుతూ ఆయా దేశాల ప్రజలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు.

కొత్త ఏడాది తమ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రంగు రంగుల దీపాల వెలుగులో అంబరాన్నంటే ఆనందంతో కొత్త ఏడాదిని ప్రజలు ఆహ్వానించారు.

తమ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత్ లోనూ నూతన సంవత్సర వేడుకలకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. పబ్బులు, మైదానాల్లోనే కాకుండా అపార్ట్ మెంట్లు, కాలనీలు, ఇళ్లలోనూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాది తమ జీవితం ఆనందంతో రంగులమయంలా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు.

New Year 2024: నేటితో మద్యం మానేద్దామనుకుంటున్నారా? ఇలా చేస్తే జీవితంలో మళ్లీ ముట్టుకోరు..