US Surgeon General : కొవిడ్‌తో నా కుటుంబంలో 10 మందిని కోల్పోయా.. వివేక్ మూర్తి

భారత్‌ సహా అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా తన కుటుంబ సభ్యుల్లో 10 మందిని కోల్పోయానని భారతీయ అమెరికన్, సర్జన్ జనరల్ వివేక్ మూర్తి చెప్పారు.

US Surgeon General : భారత్‌ సహా అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా తన కుటుంబ సభ్యుల్లో 10 మందిని కోల్పోయానని భారతీయ అమెరికన్, సర్జన్ జనరల్ వివేక్ మూర్తి చెప్పారు. వైట్ హౌస్‌లో రెండోసారి అమెరికా సర్జన్ జనరల్‌ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మూర్తి  కరోనా వ్యాప్తిపై ప్రసంగించారు. కరోనా ప్రాణాంతక వైరస్ నుంచి ప్రాణాలను రక్షించుకోవాలంటే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనాతో నా వాళ్లను కోల్పోవడం నాన్నెంతో బాధించింది.

అందుకే కరోనాతో కుటుంబాన్ని కోల్పోయే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ అనేది ఒక అవకాశమని తెలిపారు. టీకాకు అర్హత లేని ఇద్దరు చిన్నపిల్లల తండ్రిగా అంతా చూస్తూనే ఉన్నాను.. కానీ, ఈ వైరస్ నుంచి వారిని కాపాడాలంటే టీకాలు వేయాలి.. అప్పటివరకూ పిల్లలు మనందరిపై ఆధారపడి ఉన్నారని తనకు తెలుసునని చెప్పారు. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సులతో మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎప్పుడూ టీకాలు వేయించుకోని కరోనా బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. తప్పుడు సమాచారం వీరిని తప్పుదారి పట్టించారని వివేక్ మూర్తి అభిప్రాయపడ్డారు.

ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవాలన్నారు. ఇప్పటివరకు, 160 మిలియన్ల అమెరికన్లకు టీకాలు వేయించడం మంచి విషయమని అన్నారు. మిలియన్ల మంది అమెరికన్లకు ఇప్పటికీ కరోనా నుంచి రక్షించబడలేదని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని ముందుగా పరిష్కరించాలని ఆరోగ్య సంస్థలను అడుగుతున్నామని తెలిపారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఒక విద్యా ప్రచారాన్ని ప్రకటించిందని చెప్పారు.

ఆన్‌లైన్ ఆరోగ్య సమాచారాన్ని నావిగేట్ చెయ్యడానికి తల్లిదండ్రులకు సాయం చేయాలన్నారు. ఆరోగ్య సమాచార అక్షరాస్యతను మెరుగుపరచడంలో సాయపడాలని విద్యా సంస్థలను కోరారు. సాంకేతిక సంస్థలను ఎక్కువ పారదర్శకతతో ఉండాలన్నారు. తప్పుడు సమాచారంపై నిశితంగా పర్యవేక్షణ జరగాలని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్రెండింగ్ వార్తలు