Heart Failure Predict Tool : గుండెపోటుని కొన్ని వారాల ముందే పసిగట్టే పరికరం..! ఇజ్రాయెల్ పరిశోధకుల ఘనత

గుండె వైఫల్యాన్ని కొన్ని వారాల ముందే అంచనా వేయగల కృత్రిమ మేధస్సు సాధనం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్-AI) అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్ పరిశోధకులు.

Heart Failure Predict Tool : ఈరోజుల్లో గుండె జబ్బులు బాగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా లేదు. సడెన్ గా గుండెపోటు వస్తుంది. క్షణాల్లోనే మనిషి కుప్పకూలిపోతున్నాడు. చూస్తుండగా గుండెపోటుతో మరణిస్తున్నాడు. ఈ తరహా ప్రమాదాలు ఇటీవలి కాలంలో అధికం అయ్యాయి. ఈ వైనం ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో గుండె వైఫల్యాన్ని(గుండెపోటు) ముందే గుర్తించి జాగ్రత్త పడితే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ విధంగా ఏదైనా పరికరం అందుబాటులో ఉంటే చాలా మేలని అంతా అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు.

గుండె వైఫల్యాన్ని కొన్ని వారాల ముందే గుర్తించే పరికరాన్ని వారు అభివృద్ధి చేశారు. ఇజ్రాయెల్‌లోని పరిశోధకులు ECG పరీక్షలను విశ్లేషించే, కచ్చితత్వ రేటుతో గుండె వైఫల్యాన్ని అంచనా వేయగల కృత్రిమ మేధస్సు సాధనం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్-AI) అభివృద్ధి చేశారు.

Also Read..గుండెపోటు ముప్పు నుంచి బయటపడేదెలా?

ఈ సాంకేతికత ప్రస్తుతం మయోసిటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపయోగించబడుతోంది. మయోసిటిస్.. గుండె ఆగిపోయే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ కారణంగా ముందుగా మయోసిటిస్ తో బాధపడుతున్న వారిలో ఈ సాధనం ఉపయోగించారు.

2000-2020 మధ్య మయోసైటిస్‌తో బాధపడుతున్న 89 మంది రోగుల ECG స్కాన్‌లు, మెడికల్ రికార్డుల నుండి డేటాను అందించడం ద్వారా AI మోడల్ అప్‌డేట్ చేయబడింది. AI.. ECGలలోని సూక్ష్మ నమూనాలను అర్థం చేసుకోగలదని, గుండె వైఫల్యాలను ముందుగానే అంచనా వేయగలదని నివేదిక పేర్కొంది.

Also Read..Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే గుండె పోటుగా అనుమానించాల్సిందే?

ఈ సాధనం అభివృద్ధి వెనుక రాంబామ్ హెల్త్‌కేర్ క్యాంపస్‌కు చెందిన డాక్టర్ షహర్ షెల్లీ ఉన్నారు. ఈ రీసెర్చ్ కు ఆయన హెడ్ గా ఉన్నారు. ఈ సాధనం రోగుల కోసం మాత్రమే రూపొందించబడిన మొదటి AI అని ఆయన చెప్పారు.

“మేము AI మోడల్ ద్వారా ECG పరీక్షలను అమలు చేస్తున్నాము. ఇది వైద్యులు సాధారణంగా గుర్తించలేని వివరాలను చూడగలదు. గుండె ఆగిపోయే ప్రమాదం ఉన్నవారిని అంచనా వేస్తుంది” అని షెల్లీ చెప్పారు. గుండె వైఫల్యాల కారణంగా అనేక మంది చనిపోతున్న ఈ పరిస్థితుల్లో ఈ సాధనం వారి ప్రాణాలను కాపాడుతుంది అని డాక్టర్ షెల్లీ నమ్మకం వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రతిష్టాత్మక US-ఆధారిత మాయో క్లినిక్ మెడికల్ సెంటర్‌లోని కార్డియాలజీ విభాగం పరిశోధకులతో కలిసి షెల్లీ అతని బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. రోగి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించకముందే.. ఈ సాధనంతో జబ్బు ప్రారంభ దశలోనే రోగికి తగిన చికిత్స అందించడానికి వీలువుతుందన్నారు డాక్టర్ షెల్లీ. తీవ్రమైన అనారోగ్యం, మరణాలను నివారించడమే లక్ష్యంగా మా పరిశోధన కొనసాగుతోందన్నారు డాక్టర్ షెల్లీ.

ట్రెండింగ్ వార్తలు