Highways Closed, Visibility Below 200m As ‘heavy Pollution’ Masks Beijing
Beijing heavy pollution : చైనాను కాలుష్య భూతం కమ్మేసింది. భారీ వాయుకాలుష్యంతో బీజింగ్ సమీప ప్రాంతాలన్నీ చీకటిమయంగా మారిపోయాయి. బీజింగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పొగమంచు కారణంగా 200 మీటర్లు (219 గజాలు) వరకు అంతా చీకటిగా మారింది. భారీ కాలుష్యం కారణంగా బీజింగ్ హైవేలను అధికారులు మూసివేశారు. ప్రజారవాణాతో పాటు నిత్యావసర రవాణా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీజింగ్‌లో శీతాకాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
శుక్రవారం (నవంబర్ 5) రోజున బీజింగ్ రాజధాని ప్రాంతాల్లో హైవేలు మూసివేశారు. ఇప్పటికే అధికారులు భారీ కాలుష్యంతో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. కొన్ని బహిరంగ నిర్మాణాలు, ఫ్యాక్టరీ కార్యకలాపాలు, ఓపెన్ స్కూల్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నగరంలో ఎత్తైన భవనాల పైభాగం పొగమంచు కమ్మేయడంతో బయటకు కనిపించడం లేదు. బీజింగ్-టియాంజిన్-హెబీ ప్రాంతంలో తరచుగా శరదృతువు, శీతాకాలంలో భారీ పొగమంచు కప్పివేస్తుంటుంది.
వారాంతంలో సైబీరియా నుంచి వచ్చే చలి గాలులు కాలుష్యాన్ని వెదజల్లుతాయని భావిస్తున్నారు. ఈ శీతాకాలంలో ప్రధాన నగరాల్లో PM 2.5 ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. చిన్నపాటి గాలి కణాల సాంద్రతలను ఏడాదికి సగటున 4శాతం తగ్గించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బీజింగ్‌లోని US రాయబార కార్యాలయం ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో PM2.5 స్థాయి శుక్రవారం క్యూబిక్ మీటరుకు 234 మైక్రోగ్రాములకు చేరుకుంది. అంటే.. ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు.
కాలుష్య నివారణ కోసం.. చైనా మొత్తం 2021-22 శీతాకాల పారిశ్రామికీకరణ, (smog-prone north) 64 నగరాల్లో క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు మంత్రిత్వ శాఖ సెప్టెంబర్‌లో వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-20 తేదీలలో బీజింగ్ సమీపంలోని జాంగ్జియాకౌ నగరంలో వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ను చైనా నిర్వహించనుంది.
Read Also : Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!