Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!

ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు.

Pig Heart: ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. జంతువు నుంచి మనిషికి గుండె మార్పిడి విషయంలో ఇది ప్రధాన మైలురాయి.

జంతువు నుంచి మనిషికి అవయవ మార్పిడి పరిశోధనపై ఎంతోకాలంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సాధారణమే అయినా.. అవయవాల కొరత, దీర్ఘకాలంలో సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే పరిశోధనలను దశాబ్దాలుగా ట్రై చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

లేటెస్ట్‌గా జరిగిన ఆపరేషన్‌తో పరిష్కారం దొరికినట్లుగా అయ్యింది. జన్యుపరంగా మార్పు చెందిన పంది నుంచి తీసిన గుండెను విజయవంతంగా ఆ వ్యక్తికి అమర్చారు, ఇది వైద్యచరిత్రలో తొలిసారి. ఇది అవయవాల దీర్ఘకాలిక కొరతను పరిష్కరించడంలో ఈ అడుగు కీలకం కానున్నది. అయితే, అవయవ గ్రహీత అంతర్లీన ఆరోగ్య పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.

ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత.. ఇప్పుడు ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు. కొత్త అవయవం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు డాక్టర్లు. గుండె మార్పిడికి ముందు మాట్లాడిన సదరు వ్యక్తి.. నాకు గుండె మార్చకుంటే చనిపోవల్సి వస్తుంది. మారిస్తే చనిపోకుండా బతికేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు శస్త్రచికిత్స చేయించుకున్న మేరీల్యాండ్ నివాసి.

ట్రెండింగ్ వార్తలు