భూమిపై ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్ భీకర దాడి చేస్తుందా? సమయం ముంచుకొస్తుందా? అధ్యయనంలో సంచలన విషయాలు
ఏలియన్లు ఇలా ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండొచ్చు. ఎందుకంటే భూమిపై మనుషులకు ఉన్న టెలిస్కోపులు దీన్ని గమనించకుండా ఉండేందుకే.

Alien Spacecraft
Alien Spacecraft: ఓ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్ నవంబర్‌లో భూమిపై దాడి చేయవచ్చని ఓ శాస్త్రవేత్తల బృందం అంటోంది. తమ కొత్త అధ్యయనానికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఇదే నిజమైతే మానవాళికి తీవ్రమైన ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చని చెప్పింది.
ఏమిటి ఈ “హాస్టైల్” ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్?
శాస్త్రవేత్తల బృందం గుర్తించిన ఈ హాస్టైల్ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు 3ఐ/అట్లాస్ అని పేరుపెట్టారు. ఈ వస్తువు గంటకు 1,30,000 మైళ్ల వేగంతో సూర్యుడి వైపు కదులుతోందని లైవ్ సైన్స్ లో పేర్కొన్నారు.
ఇది మాన్‌హాటన్ నగరం కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ వస్తువు ఒక ఏలియన్ స్పై (గూఢచారి) టెక్నాలజీకి సంబంధించిన వస్తువు కావచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read: దేశంలో ఏయే వస్తువుల రేట్లు తగ్గుతాయి? ఏవేవి పెరుగుతాయి?
ఈ శాస్త్రవేత్తల బృందంలో హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆవి లోయెబ్ కూడా ఉన్నారు. 2017లో “ఓమువామువా” అనే అంతరిక్ష వస్తువును ఒక కృత్రిమ ఏలియన్ స్పై డివైజ్ కావచ్చని, దాని ఆకారం, వేగం ఆధారంగా చెప్పారు.
ఈ ఏడాది ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌పై చేసిన అధ్యయనంలో లోయెబ్.. లండన్ ఇంటిషియేటివ్ ఫర్ ఇంటర్‌స్టెల్లార్ స్టడీస్‌కి చెందిన ఆడమ్ హిబ్బర్డ్, ఆడమ్ క్రౌల్‌లతో కలిసి పనిచేశారు. 3ఐ/అట్లాస్ వెళ్తున్న మార్గం కూడా ఏలియన్ మూలాలను సూచిస్తోందని వారు పేర్కొన్నారు.
ఈ వస్తువు వేగం “ఓమువామువా” కంటే ఎక్కువగా ఉందని లోయెబ్ తన బ్లాగ్‌లో రాశారు. గతంలో దూసుకొచ్చిన అంతరిక్ష వస్తువులకంటే వేరే కోణంలో సౌర వ్యవస్థలో ఇది ప్రవేశించిందని అన్నారు. 3ఐ/అట్లాస్ మంగళగ్రహం, గురు, శుక్రునికి సమీపంలోకి వస్తుంది. దీని ద్వారా ఏలియన్లు రహస్యంగా స్పై డివైజ్‌లను ఉంచవచ్చు.
ఈ ఏడాది నవంబర్ చివరలో ఈ యూఎఫ్ఓ సూర్యునికి అత్యంత సమీపం (పెరిహీలియన్)గా వచ్చినప్పుడు భూమి నుంచి ఇది కనిపించదు. ఏలియన్లు ఇలా ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండొచ్చు. ఎందుకంటే భూమిపై మనుషులకు ఉన్న టెలిస్కోపులు దీన్ని గమనించకుండా ఉండేందుకే. మానవాళిపై దాడి జరగవచ్చని, రక్షణ చర్యలు అవసరం కావచ్చని లోయెబ్ హెచ్చరించారు.
3ఐ/అట్లాస్ చాలా వేగంగా కదులుతోంది కాబట్టి భూమి నుంచి అంతరిక్ష నౌక దీన్ని అడ్డుకోవడం అసాధ్యం. “మన రాకెట్లు గరిష్ఠంగా ఆ వేగంలో మూడో వంతు మాత్రమే అందుకోగలుగుతాయి. కాబట్టి దీని దగ్గరికి వెళ్లడం అసాధ్యం” అని లోయెబ్ అన్నారు.
ఊహా సిద్ధాంతం మాత్రమే
అయితే, ఆ శాస్త్రవేత్తలు సమర్పించిన ఈ పత్రం ఇంకా పీర్ రివ్యూ కాలేదు. కొందరు శాస్త్రవేత్తలు దీన్ని ఖండించారు. లోయెబ్ తన బ్లాగ్‌లోనే ఈ సిద్ధాంతాన్ని కాస్త అతిశయోక్తిగానే ఉందని అంగీకరించారు. 3ఐ/అట్లాస్ భూమిపై దాడి చేయొచ్చనేది ఊహా సిద్ధాంతం మాత్రమే.