అసలు LTV ఏంటి? మైనార్టీలకు లాంగ్ టర్మ్ వీసాను ఎలా ఇస్తారు?

  • Publish Date - December 23, 2019 / 12:06 PM IST

పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం.. దీర్ఘకాలిక వీసా (లాంగ్ టెర్మ్ వీసా-LTV)పై పొరుగుదేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్.. ఈ మూడు దేశాల నుంచి భారతదేశానికి వచ్చినవారంతా పౌరసత్వ హోదా పొందవచ్చు. దీర్ఘ కాలిక వీసా కలిగి ఉన్నవారికే మాత్రమే ఇది వర్తిస్తుంది. అసలు LTV అంటే ఏంటి? అది ఎవరికి వర్తిస్తుంది.. ఎలా పొందొచ్చు.. ఎలాంటి బెనిఫెట్స్ పొందవచ్చు.. ఏయే షరతులు వర్తిస్తాయో ఓసారి నిశితంగా పరిశీలిద్దాం..

వీసా కాల పరిమితి:
ఈ మూడు దేశాల నుంచి ఇండియాకు ఎందుకు వచ్చారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ LTV.. దీర్ఘకాలిక వీసాలను 5 ఏళ్లు లేదా ఏడాది కాల పరిమితితో జారీ చేస్తారు. మరో సందర్భంలో అంటే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి భారత పౌరసత్వం కోరుతూ వచ్చేవారికి మాత్రమే ఈ LTV వీసా జారీ చేస్తారు. రెండేళ్ల ప్రాతిపాదికన వీసాను పొడిగించడం జరుగుతుంది.

ఎవరు వీసా పొందొచ్చు :
CAAలో పొందుపరిచిన ఈ మూడు దేశాలకు చెందిన జాతీయులకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ (MHA) నాలుగు కేటగిరీలుగా విభజించి జారీ చేస్తుంది. అందులో మైనార్టీలు, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్లు, బుద్ధులకు ఇది వర్తిస్తుంది. ఈ మూడు దేశాల నుంచి జాతీయుల్లో ఎవరైనా భారత పౌరులను వివాహం చేసుకోవడం, భారత సంతతిలో తిరిగి భారత్ రావాలనుకునే వారిలో వితంతువులు లేదా విడాకులు పొందిన మహిళలు ఈ వీసాను పొందవచ్చు. ఇతర విదేశీ జాతీయుల్లో ఎవరైనా స్వదేశంలో హింసకు గురైనట్టుగా ధ్రువీకరిస్తే వారికి కేసుల వారీగా LTV మంజూరు చేయడం జరుగుతుంది. 1967 ప్రోటోకాల్‌తో పాటు శరణార్థుల స్థితిపై 1951 యూనైటెడ్ నేషన్స్ కన్వెన్షన్‌లో భారత్ సంతకం చేయకపోవడం ద్వారా ఇది వర్తిస్తుంది.

లింగం – మత తటస్థం? :
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? మతంతో ప్రస్తావన లేకుండా పాకిస్థాన్ మహిళలు లేదా బంగ్లాదేశ్ మహిళలకు మాత్రమే ఈ ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. భారతీయులను వివాహం చేసుకుంటే వారికి LTV వీసాలను మంజూరు చేయడం జరుగుతుంది. అదే అఫ్గానిస్థానీల విషయంలో లింగం లేదా మతంతో సంబంధం లేకుండా భారతీయ పౌరులతో వివాహం చేసుకోవడానికి LTV అర్హతకు అనుమతిస్తుంది. 

ఎలా పొందాలంటే :
LTV వీసా పొందాలంటే.. దరఖాస్తుదారులు తమ పాస్ పోర్టు కాపీ, వీసా, రెసిడెన్షియల్ పర్మిట్, ఫొటోగ్రాఫ్, భారతీయ హామీదారు నుంచి నష్టపరిహార బాండ్, హామీదారు గుర్తింపు పత్రం, ఫొటోగ్రాఫ్, భారతీయ జీవిత భాగస్వామి నివాస ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రంతో పాటు మరణం లేదా విడాకుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. పాకిస్తాన్ పౌరుల నుంచి రూ .100 ఛార్జీ చెల్లించాలి. ఆఫ్ఘన్స్, బంగ్లా దేశీయులకు ఉచితంగా జారీ అవుతుంది.

షరతులు వర్తిస్తాయి :
LTV వీసాదారులు ఏడాదిలో ఒకసారి తమ స్థానిక పోలీసు అధికారులకు రిపోర్ట్ చేయాలి. వారి మొబైల్ నంబర్‌ను FRRO లేదా DCP లేదా FROతో పంచుకోవాలి. క్యాలెండర్ సంవత్సరంలో ఒకసారి స్వదేశాన్ని సందర్శించాలి.. అది 90 రోజుల కంటే మించకూడదు. అందులో మరొక విదేశ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతి ఉంది.

సౌకర్యాలు :
LTV వీసాదారులు ప్రైవేటు రంగానికి మాత్రమే పని చేయవచ్చు లేదా స్వయం ఉపాధి పొందవచ్చు. వారు ఏదైన ప్రభుత్వ సంస్థల నుంచి ఉద్యోగానికి అనర్హులు. దేశంలో ఇల్లు కొనవచ్చు కాని దాన్ని అమ్మలేరు. వారు బ్యాంక్ ఖాతా తెరవవచ్చు. పాన్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందవచ్చు. వారి పిల్లలు ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యా సంస్థలలో ప్రవేశానికి అనుమతిస్తారు.

ఎవరు అర్హులు కాదు :
భారత్‌లో ఉపాది కోసం వచ్చేవారికి LTV వీసా పొందేందుకు అర్హత లేదు. దేశానికి వచ్చే పర్యాటకులను ప్రోత్సహించేందుకు, విదేశీ ఆదాయాలను పెంచేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిస్టులకు LTV వీసాలను ప్రతిపాదించింది. అయినప్పటికీ దేశంలో ఉపాధి కోరే వలసదారులకు మాత్రం LTV వీసా పొందే హక్కు లేదు.