China Hybrid warfare: చైనాకు చెందిన జెన్‌వా డేటా టెక్నాలజీ కంపెనీ,Hybrid warfareలో ఇప్పుడు తామే టాప్ అని చెబుతోంది. అసలు Hybrid warfare అంటే? దీని ద్వారా ఏమేం చేయొచ్చు? భారత్‌కు సంబంధించి ఇది ఎలాంటి చట్టాలను ఉల్లంఘిస్తోంది? జెన్‌వా కంపెనీ గూఢచర్యం వెనకున్న టార్గెట్ ఏంటి?
భారత్‌పై.. చైనా కంపెనీల గూఢచర్యం బైట్‌కి రావడంతో ఈ Hybrid warfare ఇప్పుడు హాట్ టాపిక్.దేశంలోని ప్రముఖులపై నిఘా పెట్టి వారి కదలికలను గమనించడం, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చైనా రికార్డ్ చేయడంతో కలకలం .
1999లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ Unrestricted Warfare పేరుతో ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది.
అందులో Hybrid warfareకు సంబంధించిన స్ట్రక్చర్‌ని సెట్ చేశారు. మిలటరీ నుంచి పొలిటికల్‌కి షిఫ్ట్ అవడం, ఆర్థికవ్యవస్థ నుంచి సాంకేతికత వైపు మళ్లడం లాంటివన్నీ, యుద్ధంలో కొత్త ఆయుధాలుగా పరిచయం చేశారు.
దీని ద్వారా ఏదో ఒకరోజు ప్రజలు ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పరిస్థితుల గురించి తెలుసుకుంటారని చెప్పారు. శత్రుదేశాన్ని టెక్నాలజీతో దెబ్బకొట్టడమే Hybrid warfare. హాంకాంగ్ నిరసనల్లో చైనా ఈ హైబ్రీడ్ వార్‌ఫేర్‌ను బాగా వాడుకుంది. అందుకే దానిని ఇప్పుడు ఇండియాపై ప్రయోగిస్తోంది.
ఈ Hybrid warfare భారత్‌లోని ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2011, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం.. ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ డేటా, ఇతర సమాచారం.. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ అందుబాటులో ఉన్న ఇతర సమాచారంతో కలిపి.. అతన్ని గుర్తించేందుకు మాత్రమే మన చట్టాలు అనుమతిస్తున్నాయ్. అంతే తప్పఅతని సమాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు వీల్లేదు.
https://10tv.in/india-china-need-to-follow-mutually-agreed-reciprocal-actions-to-restore-peace-at-border-mea/
ఈ రూల్స్ డైరెక్ట్ మార్కెటింగ్ కోసం వ్యక్తిగత డేటాను వాడటంపై ఎలాంటి షరతులు విధించలేదు. ఐతే చైనాకు చెందిన జెన్‌వా కంపెనీ, మన దేశ ప్రముఖుల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం థర్డ్ పార్టీ కిందకు వస్తుంది. అందువల్ల.. చైనాకు చెందిన స్పై కంపెనీ మన చట్టాలను ఉల్లంఘిస్తోంది.
వ్యక్తి అంగీకారం లేకుండానే చైనాకు చెందిన జెన్‌వా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అతనికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలిస్తోంది. సోషల్ మీడియా సైట్ల నుంచి ప్రముఖుల సమాచారాన్ని గ్రాబ్ చేస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్‌ని.. శత్రుదేశానికి చెందిన నిఘా సంస్థలు, భద్రతా ఏజెన్సీలతో పంచుకుంటోంది. ఇదంతా.. భారత ఐటీ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది.
అలాగని ప్రైవసీ చట్టాలు, విదేశీ అధికార పరిధిలో అమలు చేయడం అసాధ్యం. ఎందుకంటే అక్కడి చట్టాలు మన దేశానికి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ ఎప్పటికీ మారవు.
దాదాపు పదేళ్ల నుంచి భారత రాజకీయ నాయకులు, రక్షణ సిబ్బందిని.. చైనా ట్రాక్ చేస్తున్నట్లు తేలింది. ఇప్పటివరకు ఐదుగురు ప్రధానమంత్రులు, 24 మంది సీఎంలు, దాదాపు 350 మంది ఎంపీలపై.. చైనా కంపెనీ గూఢచర్యం చేస్తోంది. ఇండియాపై Hybrid warfare ప్రారంభించేందుకు చైనా ఈ డేటాను ఉపయోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారత ప్రభుత్వం చైనా వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించడం, సరిహద్దుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని చైనా ఈ డర్టీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.