Zelensky Kyiv : నేను పారిపోలేదు, ఇక్కడే ఉన్నా.. లొకేషన్ షేర్ చేసిన జెలెన్ స్కీ

నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నా(Zelensky Kyiv). నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడటం లేదు. దేశం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో..

Zelensky Kyiv

Zelensky Kyiv : తాను రహస్య ప్రాంతానికి పారిపోయినట్టు వస్తున్న వార్తలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. తాను పారిపోయినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను ఎక్కడా దాక్కోలేదని, రహస్య ప్రాంతానికి పారిపోలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తను ఎక్కడ ఉన్నానో తెలియజేసే లొకేషన్ ను ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ కూడా చేశారు. ‘‘నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నా(Zelensky Kyiv). నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడటం లేదు. దేశం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో మనం కచ్చితంగా గెలుస్తాం’’ అంటూ పోస్ట్ పెట్టారు జెలెన్ స్కీ.

కాగా, ఈ దేశ భక్తి యుద్ధంలో గెలవడానికి మనం ఏదైనా కోల్పోవచ్చని యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి జెలెన్ స్కీ అన్నారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలు పెట్టింది. నాటి నుంచి యుక్రెయిన్ పై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కాగా, తనను చివరిగా చూడడం ఇదే కావచ్చంటూ కొన్ని రోజుల క్రితం జెలెన్ స్కీ నిర్వేద ప్రకటన చేయడం సంచలనం రేపింది. దీంతో జెలెన్ స్కీ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయి ఉంటారన్న కథనాలు వచ్చాయి.

Russia-Ukraine War : ఇదేనా మానవత్వమంటే.. రాత్రిపూట జనావాసాలపై రష్యా బాంబుల దాడి.. 18 మంది దుర్మరణం..!

కాగా, యుక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత రష్యా మరో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా జాబితాకెక్కింది. ఇప్పటివరకు ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని రష్యా దాటేసింది. యుక్రెయిన్‌పై దాడికి దిగిన పది రోజుల్లోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో చేరిపోయింది.

యుక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేయడంతో ఏకైక ఆయుధమైన ఆంక్షల అస్త్రాన్ని బయటకు తీశాయి. యుక్రెయిన్‌పై రష్యా ఆయుధాలతో విరుచుకుపడుతుంటే.. ఇతర దేశాలన్నీ రష్యాపై ఆంక్షల దాడిని తీవ్రతరం చేశాయి. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ యుద్ధాన్ని కొనసాగిస్తోంది రష్యా.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపగలిగేది ప్రపంచంలో అతనొక్కడే.. పుతిన్ ఆయన మాటే వింటాడు!

ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పటి వరకు 2,778 కొత్త ఆంక్షలను రష్యాపై విధించాయి. ఫలితంగా ఆ దేశంపై ఉన్న మొత్తం ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపై ఉన్న ఆంక్షలను గణించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) ఈ వివరాలను వెల్లడించింది. అణు కార్యక్రమం, తీవ్రవాదానికి మద్దతిస్తుందన్న కారణంతో ఇరాన్‌ గత దశాబ్ద కాలంగా 3,616 ఆంక్షలను ఎదుర్కొంటోంది. రష్యా, ఇరాన్ తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో సిరియా, ఉత్తరకొరియా, వెనిజులా, మయన్మార్, క్యూబా ఉన్నాయి. కాగా, ఓవైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు యుక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా.

Russia Unfriendly Countries : అన్‌ఫ్రెండ్లీ కంట్రీస్‌.. తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించిన రష్యా