Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపగలిగేది ప్రపంచంలో అతనొక్కడే.. పుతిన్ ఆయన మాటే వింటాడు!

యుక్రెయిన్‍‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే పుతిన్ మనసు మార్చగలడని, ఆయన మాటే రష్యా అధ్యక్షుడు వింటారని ప్రముఖ ఆర్థికవేత్త తెలిపారు.

Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపగలిగేది ప్రపంచంలో అతనొక్కడే.. పుతిన్ ఆయన మాటే వింటాడు!

Russia Ukraine War Only One Person In The World Can Influence Putin, Noted Economist Stephen Roach

Russia Ukraine War : యుక్రెయిన్‍‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర యుక్రెయిన్ నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాలు హెచ్చరించినా పట్టించుకోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ అడ్డుచెప్పినా పట్టించుకోవడం లేదు. నేను మోనార్క్.. నేనేంతే అన్నట్టుగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. యుక్రెయిన్‌తో శాంతిపరమైన చర్చలకు దిగినప్పటికీ కూడా యుద్ధం కొనసాగుతోంది.

మూడు సార్లు శాంతిపరమైన చర్చల కోసం ప్రయత్నించగా విఫలమయ్యాయి. యుక్రెయిన్ కూడా రష్యా చర్యలకు తలొగ్గడం లేదు. శక్తికి మించి రష్యాతో పోరాటం చేస్తోంది. ఒకవైపు ఐక్యారాజ్య సమితి, అమెరికా నుంచి ఇతర నాటో సభ్య దేశాలు సైతం యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కు సూచించాయి. కానీ, పుతిన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు పుతిన్‌ చర్యలపై వెనక్కి తగ్గాలని సూచించారు. శాంతి చర్చలతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. పుతిన్ మాత్రం అదే పంథాను కొనసాగిస్తున్నారు. అయితే, ప్రపంచంలో ఎవరూ చెబితే పుతిన్ మాట వింటారు అనేది చర్చకు దారితీసింది.

Russia Ukraine War : పుతిన్‌ మనసును మార్చగలిగేది ఆయనే : 

దీనిపై ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్‌ రోచ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే పుతిన్ మనసు మార్చగలడని, ఆయన మాటే రష్యా అధ్యక్షుడు వింటారని తెలిపారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం సంక్షోభం సమయంలో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే పుతిన్‌ వెనక్కి తగ్గేలా చేయగలరని తెలిపారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మన పక్క దేశమైన డ్రాగన్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. యుక్రెయిన్‌ రష్యాల మధ్య యుద్ధం విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న పుతిన్‌ను ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఒక్క జింగ్ పిన్ మాత్రమేనని అమెరికన్‌ ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ అభిప్రాయపడ్డారు.

Russia Ukraine War Only One Person In The World Can Influence Putin, Noted Economist Stephen Roach (1)

Russia Ukraine War Only One Person In The World Can Influence Putin, Noted Economist Stephen Roach

ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ మాట్లాడుతూ.. యుక్రెయిన్‌ పరిణామాలపై పుతిన్‌ మనసును మార్చగలిగేది ప్రపంచంలో ఏకైక వ్యక్తి జిన్ పింగ్ మాత్రమేనన్నారు. ఎందుకంటే చైనా, రష్యాల బంధం అలాంటిదేనన్నారు. పుతిన్, జిన్ పింగ్ బంధం బలమైనదిగా పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మంచి రాజకీయ అవగాహన కూడా ఉంది. యుక్రెయిన్ ఉద్రిక్తత పరిస్థితులను ఆపగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జిన్ పింగ్ మాత్రమేనని అన్నారు.

ఆయనకు మాత్రమే పుతిన్ చర్యలను అడ్డుకోగల శక్తి ఉందని ఎకనమిస్ట్‌ స్టీఫెన్‌ తెలిపారు. నా ఉద్దేశ్యం ప్రకారం.. చైనా ట్రంప్ కార్డును కలిగి ఉంది. ఈ క్షణాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం జిన్ పింగ్ కు మాత్రమే భావిస్తున్నానని స్టీఫెన్ అభిప్రాయపడ్డారు.. ప్రస్తుతం ఈయనొక్కడే ఇప్పుడు పుతిన్‌ను ప్రభావితం చేయగలరని అన్నారు. రష్యాతో బంధం ఎంతో బలమైనదిగా ఇప్పటికే చైనా ప్రకటించింది. అందుకే యుక్రెయిన్ రష్యా వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Read Also : Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్‌తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు