Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్‌తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు

యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైన్యాన్ని యుక్రెయిన్ సైన్యం ధీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు.

Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్‌తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు

Russia Ukraine War Zelensky Requests Russia To Stop War On Ukraine, Will Have To Talk

Russia-Ukraine War : యుక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా సైన్యాన్ని యుక్రెయిన్ సైన్యం ధీటుగానే ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యాకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలకు సిద్ధమంటూ ఆయన ప్రతిపాదన తీసుకొచ్చారు. యూరప్‌పై జరుగుతున్న యుద్ధంగానే చూడాలని జెలెన్‌స్కీ పుతిన్‌కు సూచించారు. ఇది యుక్రెయిన్‌పై మాత్రమే జరుగుతున్న యుద్ధం కాదన్నారు. యుక్రెయిన్ పౌరుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

యుద్ధం ఆపాలంటూ యూరప్ వాసులంతా డిమాండ్ చేయాలని జెలెన్‌స్కీ సూచించారు. యుక్రెయిన్‌కు మిలటరీ, ఆర్థిక సాయం అందించేలా మీ దేశాలపై ఒత్తిడి పెంచాలని యుక్రెయిన్ అధ్యక్షుడు యూరప్ వాసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు యుద్ధం కారణంగా చనిపోకుండా ఆపేందుకు చర్చలకు సిద్ధమని జెలెన్ స్కీ సూచించారు. జెలెన్ స్కీ ప్రతిపాదనతో ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు పుతిన్ సిద్ధమైనట్టు సమాచారం.

Russia Ukraine War Zelensky Requests Russia To Stop War On Ukraine, Will Have To Talk (1)

Russia Ukraine War Zelensky Requests Russia To Stop War On Ukraine, Will Have To Talk

అంతకముందే.. యక్రెయిన్‌పై రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలైన 40 గంటల తర్వాత యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆయుధాలు వదిలితేనే యుక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలారోవ్ కీలక ప్రకటన చేశారు.

యుక్రెయిన్ సైన్యం పోరాటం ఆపి వెంటనే లొంగిపోవాలన్నారు. యుక్రెయిన్ సైన్యం.. తమ ఆయుధాలను వెంటనే వదిలితే ఆ దేశంతో తాము చర్చలకు సిద్ధమని సెర్గీలారోవ్ ప్రకటించారు. రష్యా తాజా ప్రకటనపై యుక్రెయిన్ అధ్యక్షుడు స్పందించారు. మరోవైపు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫోన్లో మాట్లాడారు. యుక్రెయిన్ పరిస్థితులను జిన్‌పింగ్‌కు పుతిన్ వివరించారు. చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని జిన్‌పింగ్ పుతిన్‌ను కోరారు.

Read Also : Russia-Ukraine War : యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. పోరాటం ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధం!