Russia-Ukraine War : యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. పోరాటం ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధం!

యక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా కీలక ప్రకటన చేసింది. 40 గంటల తర్వాత యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆయుధాలు వదిలితేనే చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది.

Russia-Ukraine War : యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. పోరాటం ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధం!

Russia Ukraine War Russian Foreign Min Says Ready To Talk If Ukraine Army 'lays Down Arms', Want To 'free Ukraine From Oppression'

Russia-Ukraine War : యక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలైన 40 గంటల తర్వాత యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆయుధాలు వదిలితేనే యుక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలారోవ్ కీలక ప్రకటన చేశారు. యుక్రెయిన్ సైన్యం పోరాటం ఆపి వెంటనే లొంగిపోవాలన్నారు.

యుక్రెయిన్ సైన్యం.. తమ ఆయుధాలను వెంటనే వదిలితే ఆ దేశంతో తాము చర్చలకు సిద్ధమని సెర్గీలారోవ్ ప్రకటించారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌ ఎదుర్కొనే పరిణామాలపై ఆయన ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోయినట్టుయితే అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని సెర్గీలారోవ్ వెల్లడించారు. యుక్రెయిన్‌ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని సెర్గీలారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రష్యా తాజా ప్రకటనపై యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు యుక్రెయిన్‌ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరు దేశాలు చర్చల ప్రస్తావన తేవడంతో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. రష్యా-యుక్రెయిన్‌లు సయోధ్య దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు సైతం ఊపిరి పీల్చుకుంటున్నాయి.

మరోవైపు.. రష్యా సేనలను యక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇప్పటివరకూ 800 మంది రష్యా సైనికులను యుక్రెయిన్ సైన్యం హతమార్చింది. 30 రష్యన్ యుద్ధ ట్యాంకర్లను యుక్రెయిన్ ధ్వంసం చేసింది. ఆరు హెలికాప్టర్లు, 7 యుద్ధ విమానాలను కూల్చేసినట్టు యుక్రెయిన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Russia Ukraine War Russian Foreign Min Says Ready To Talk If Ukraine Army 'lays Down Arms', Want To 'free Ukraine From Oppression' (1)

Russia Ukraine War Russian Foreign Min Says Ready To Talk If Ukraine Army ‘lays Down Arms’, Want To ‘free Ukraine

యుక్రెయిన్ ఆర్మీ డ్రెస్‌లో రష్యా సైన్యం చొరబడింది. ఈ క్రమంలో 450 మందికి పైగా యుక్రెయిన్ సైనికులను రష్యా చంపింది. యుక్రెయిన్ సైన్యం డ్రెస్సులతో ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుపోయేందుకు రష్యా సేన ప్రయత్నిస్తోంది. పౌరుల వాహనాలపైకి ట్యాంకర్లను రష్యా సైన్యం ఎక్కిస్తోంది. రష్యా సేన చర్యలను యుక్రెయిన్ సైన్యం కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.

Read Also : Russia-Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కేంద్రబిందువు.. గుత్తాధిపత్యానికి కారణమిదేనా..?