Russia Unfriendly Countries : అన్‌ఫ్రెండ్లీ కంట్రీస్‌.. తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించిన రష్యా

రష్యా ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. స్థానికులకు ఈ జాబితా దేశాల్లోని రుణదాతలకు రూబెళ్లలో చెల్లించే అవకాశం దక్కుతుంది. నెలకు 10 మిలియన్ రూబెళ్ల కంటే ఎక్కువ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.

Russia Unfriendly Countries : అన్‌ఫ్రెండ్లీ కంట్రీస్‌.. తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించిన రష్యా

Russia (1)

Russia Unfriendly Countries : రష్యా తన వ్యతిరేక దేశాల జాబితాను ప్రకటించింది. రష్యాతోపాటు అక్కడి సంస్థలు, పౌరులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల జాబితాను ఆమోదించింది. అమెరికా, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, యుక్రెయిన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాలన్నీ.. ఇటీవల రష్యాపై ఆంక్షలు విధించినవే. రష్యా ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. స్థానికులకు ఈ జాబితా దేశాల్లోని రుణదాతలకు రూబెళ్లలో చెల్లించే అవకాశం దక్కుతుంది. నెలకు 10 మిలియన్ రూబెళ్ల కంటే ఎక్కువ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది.

యుక్రెయిన్, రష్యా మధ్య 13 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ టార్గెట్‌గా రష్యా సైన్యం కదులుతోంది. ఆ నగరం చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను ఇప్పటికే కీవ్ సరిహద్దులకు తరలించింది. త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తున్న రష్యా సైనికులు.. కీవ్‌పై పట్టు చిక్కించుకునేందుకు దూసుకుపోతున్నారు. మరోవైపు… రష్యా సైన్యం కీవ్‌లోకి అడుగుపెట్టకుండా యుక్రెయిన్‌ పటిష్ట వ్యూహం అమలు చేస్తోంది. సిటీలోని ప్రధాన వీధుల్లో నిఘా పెంచింది. ప్రతి సెంటర్‌లో పెద్ద ఎత్తున్న సైన్యాన్ని మోహరించింది. రహదారులపై ఇసుక బస్తాలు, బారికేడ్లు, ముళ్ల కంచెలను అడ్డుగా పెట్టింది.

Tamil Nadu Student : యుక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి

రష్యాతో పోరులో యుక్రెయిన్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి దాడి చేస్తూనే ఉంది. మా దేశాన్ని కాపాడుకుంటాం, దురాక్రమణకు గురికానివ్వమంటూ యుక్రెయిన్‌ వాసులు ప్రతి దాడులు చేస్తున్నారు. ఆఖరికి మహిళలు, చిన్నపిల్లలతో సహా.. సమరానికి సై అంటూ కదనరంగంలోకి దిగుతున్నారు. రష్యా దళాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. రష్యన్‌ యుద్ధ ట్యాంకులను అడ్డుకుంటున్నారు. వాటిని కాల్చివేస్తున్నారు. ఇరుదేశాల దాడుల్లో ఇప్పటికే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

రష్యా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న యుక్రెయిన్‌.. ఆ దేశ సైన్యాన్ని చావుదెబ్బ కొడుతోంది. యుద్ధం మొదలై ఇప్పటికే 12 రోజులు గడిచిపోవడంతో.. రష్యన్‌ సేనలకు ఆహారం, యుద్ధ వాహనాలకు ఇంధనం కొరత ఏర్పడుతోంది. యుక్రెయిన్ వాసులు కూడా సరిగ్గా దానిపైనే టార్గెట్ చేస్తున్నారు. రష్యా నుంచి యుక్రెయిన్‌లోకి వచ్చే ఆయిల్ ట్యాంకర్లను, ఆహార సరఫరా చేస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారు.