Influencer Marina : ముక్కు సర్జరీ కోసం పోతే మొత్తానికే లేపేశారు

ఒక మిలియన్ శస్త్రచికిత్సలలో ఒకసారి జరగడంతో వైద్యులు సైతం ఖంగుతిన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చెప్తున్నారు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయకముందే మెరీనా లెబెదేవాకు అన్నీ పరీక్షలు

Influencer Marina : అందంకోసం తన ముక్కుకు సర్జరీ చేయించుకునే ప్రయత్నంలో ఓ ఇన్ ప్లూయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది. రష్యాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మెరీనా లెబెదేవా తన ముక్కు ఆకారాన్ని మార్చుకోవడానికి రైనోప్లాస్టీ సర్జరీ కోసం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆర్టీబీట్ క్లినిక్‌లో చేరింది. తర్వాత ఆపరేషన్‌ ప్రక్రియలో భాగంగా మత్తుమందు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయింది.

మత్తుమందుకి ఆమె శరీరం ప్రతికూలంగా స్పందిస్తోందని వైద్యులు గ్రహించిన వెంటనే మరో ఆస్పత్రిలో చేర్చే క్రమంలో ఆమె ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందన్న వాదన వినిపిస్తోంది. పోలీసులు ఈఘటనపై క్రిమనల్‌ కేసు నమోదు చేశారు. కాగా మెరీనా లెబెదేవా మరణించే సమయంలో ఆమె భర్త ఇతర కార్యక్రమాల నిమిత్తం అందుబాటులో లేడు..

ఒక మిలియన్ శస్త్రచికిత్సలలో మొదటిసారి ఇలా జరగడంతో వైద్యులు సైతం ఖంగుతిన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చెప్తున్నారు. రైనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయకముందే మెరీనా లెబెదేవాకు అన్నీ పరీక్షలు చేశామని ఆర్టీబీట్ క్లినిక్ డైరెక్టర్ అలెగ్జాండర్ ఎఫ్రెమోవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రిపోర్ట్‌ల ప్రకారం మెరీనా లెబెదేవా జన్యుపరమైన పరిస్థితి కారణంగా మరణించిందని క్లినిక్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ఆమె మరణ వార్త తెలుసుకొన్న వెంటనే ఆమె భర్త సెయింట్ పీటర్స్‌బర్గ్‌ కు చేరుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువైతే, సర్జన్లకు ఆరేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు