Alon Musk
Elon musk : టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. 44 బిలియన్లకు ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైన మస్క్.. అప్పటి నుంచి ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అదే స్థాయిలో విచిత్రమైన పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.
The word “Nazi” doesn’t mean what he seems to think it does pic.twitter.com/pk9SQhBOsG
— Elon Musk (@elonmusk) May 9, 2022
అంతకుముందు మస్క్ ఓ ట్వీట్ చేశాడు. రష్యన్ అధికారి మస్క్‌కు పంపిన సందేశాన్ని ఇంగ్లీష్‌లో తర్జమా చేసి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. అనే ట్వీట్ చేశాడు. రష్యన్ అధికారి మస్క్‌కు పంపించిన సందేశంలో.. ‘ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది.. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను అనుమాస్పదంగా చనిపోతే అని ట్వీట్ చేయడంతో ఇది పరోక్షంగా రష్యాను ఉద్దేశించే మస్క్ వ్యాఖ్యానించారా అన్నచర్చ నడుస్తున్నది.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
అయితే మస్క్ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు జోకులు వేస్తుండగా, మరికొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు.. మిస్టర్ మస్క్ మత్తులో ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మరికొందరు నెటిజన్లు విపరీతమైన పనులు మస్క్‌ను ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొనగా, మరికొందరు ట్విటర్‌లో నూతన సంస్కరణలు తీసుకురావడానికి మస్క్ బతికే ఉండాలంటూ రీట్వీట్లు చేశారు.