Imprisoned children in Iran suffer violence, electric shocks
Amnesty: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో రేగిన వివాదం పెద్ద ఎత్తున నిరసనకు దారి తీసింది. కొద్ది నెలలుగా ఈ నిరసన తీవ్ర స్థాయిలో కొనసాగింది. కాగా, ఇటీవల కొన్ని సంస్థలు చేసిన సర్వేల ప్రకారం.. నిరసనలో పట్టుబడి జైలులో ఉన్నవారిపై తీవ్ర హింస సాగుతోందని, లైంగిక దాడులు కూడా తీవ్రమయ్యాయని తెలుస్తోంది. పిల్లలను సైతం వదిలి పెట్టకుండా అన్ని రకాలుగా తీవ్రంగా హింసిస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల సంఘం తన తాజా నివేదికలో పేర్కొంది. ఇరాన్‌లోని రివల్యూషనరీ గార్డ్స్, పారామిలిటరీ బాసిజ్, పబ్లిక్ సెక్యూరిటీ పోలీసులు సహా ఇతర భద్రతా దళాలు చేస్తున్న క్రూరమైన పద్ధతులను అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది.
ఒప్పుకోవడానికి చిత్రహింసలు
నివేదిక ప్రకారం, పిల్లలను కొట్టడమే కాకుండా, విద్యుదాఘాతాలు, అత్యాచారం వంటి లైంగిక హింస కూడా చేశారు. ఈ చిన్నారుల వయస్సు 12 ఏళ్లలోపు ఉంటుంది. ఇందులో బాలురు, బాలికలు ఇద్దరూ ఉన్నారట. ఈ నివేదికలో బయటపడ్డ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక ఆందోళన కారణంగా ఈ చిన్న పిల్లలను పట్టుకుని జైలులో పెట్టారట. తమ నేరాన్ని బలవంతంగా ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేశారు. గత సెప్టెంబరులో, ఇరాన్‌లో హిజాబ్‌ను ధరించనందుకు ఇరాన్ మోరల్ పోలీసుల అదుపులో ఒక యువ ఇరాన్ కుర్దిష్ మహిళ మరణించింది. ఇది ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలను ప్రేరేపించింది. 1979 ఇరాన్‌లో సాగిన ఇస్లామిక్ రిపబ్లిక్ విప్లవం అనంతరం.. ఈ తాజా నిరసనలో దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
Pakistan: మాజీ ప్రధాని కోర్టుకెళ్లగానే.. ఆయన ఇంట్లోకి చొరబడి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
క్రూరంగా హింసిస్తున్నారు
ఇరాన్‌లో నిరసనకారులను దారుణంగా హింసిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులు, పిల్లలతో పాటు 17 మంది యువ ఖైదీలతో సహా మైనర్ నిరసనకారులను హింసించడాన్ని చాలా మంది చూశారు. దేశంలోని యువతలో స్ఫూర్తిని అణిచివేసేందుకు.. స్వేచ్ఛ, మానవ హక్కులను డిమాండ్ చేయకుండా నిరోధించడానికి పిల్లలపై హింస జరిగిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ డయానా ఎల్తాహవి పేర్కొన్నారు. పోలీసు అధికారులు పిల్లలను కొరడాతో కొట్టారు. స్టన్ గన్ ఉపయోగించి విద్యుత్ షాక్‌లు ఇచ్చారు. పిల్లల్ని నీళ్లల్లో ముంచి ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. కాగా, ఒకవైపు ఇంత హింస జరుగుతున్న ఇదే సమయంలో, నిరసనలలో పాల్గొన్న 22,000 మందితో సహా ఇతర కేసుల్లో ఖైదీలైన మరో 80,000 మంది క్షమాపణలు పొందడం గమనార్హం.