Twitter‌లో అందర్నీ వదిలించుకున్న ఇమ్రాన్ ఖాన్

  • Publish Date - December 9, 2020 / 11:34 AM IST

Imran Khan Unfollows : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నెటిజన్లు యమ ట్రోలింగ్ చేసేస్తున్నారు. అసలు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అనేగా సందేహం. ట్విట్టర్ (Twitter) ఖాతాలో ఎవరినీ ఫాలోకావడం లేదు. అందర్నీ అన్ ఫాలో (Unfollows) చేసేశారు. ఎవరినీ అనుసరించకున్నా..12.9 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. 2010లో ఆయన ట్విట్టర్ ఖాతా (Twitter) తెరిచారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన విశేషాలను ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారు.



మూడో వివాహం చేసుకున్నా..మొదటి భార్య జెమియాను ట్విట్టర్ ద్వారా ఫాలో అయ్యేవారు. అయితే..తాజాగా..అందర్నీ అన్ ఫాలో చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నవాజ్ షరీఫ్ బాటలో పయనిస్తున్నారంటూ..అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కొంతమంది జోక్స్ పేలుస్తున్నారు. మాజీ భార్య జెమీయా గోల్డ్ స్మిత్ హృదయాన్ని ముక్కలు చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు.




ఇతను మాజీ క్రికేటర్. 2018, ఆగస్టు 18వ తేదీన పాక్ 22వ ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మెజార్టీ సభ్యులు ఇమ్రాన్ మద్దతు పలికారు. పోలింగ్ లో స్వల్ప మెజార్టీతో గటెక్కారు. ఇమ్రాన్ ఖాన్ కు 172 ఓట్లు అవసరం ఉంటే..176 ఓట్లు నమోదయ్యాయి.