Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు భారీగా వచ్చిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

 పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘తోషఖానా’ విషయంలో గతంలో ఇమ్రాన్ ఖాన్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

Imran Khan: పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానా ‘తోషఖానా’ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు లాహోర్ లోని ఆయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారో పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఇమ్రాన్ ఆయన నివాసంలో లేరని పోలీసులు తెలుసుకున్నారు.

‘తోషఖానా’ విషయంలో గతంలో ఇమ్రాన్ ఖాన్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ తనకు వచ్చిన బహుమతుల్లో నాలుగింటిని అమ్మేశానని గత ఏడాది సెప్టెంబరు 8న అంగీకరించారు. ‘తోషఖానా’ విషయంలో మరిన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల తీరుపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేస్తే దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని పీటీఐ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరు కావట్లేదు. తనకయిన గాయం కారణంగా తాను రాలేనని చెబుతూ వస్తున్నారు. దీంతో ఆయనపై సెషన్స్ కోర్టు జడ్జి నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రధాని హోదాలో ఇమ్రాన్ కు వచ్చిన ఖరీదైన బహుమతులను తోషఖానా నుంచి ఆయన తక్కువ ధరకు కొన్నారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం వాటిని అధిక ధరకు అమ్ముకున్నారని తెలియడంతో ఈసీ కూడా ఆయనపై ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేయడం గమనార్హం.


Zoom layoffs: ప్రెసిడెంట్‌కు షాకిచ్చిన ‘జూమ్’.. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడి తొలగింపు

ట్రెండింగ్ వార్తలు