Zoom layoffs: ప్రెసిడెంట్‌కు షాకిచ్చిన ‘జూమ్’.. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడి తొలగింపు

తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించిందిదీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థలో ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొంది 10 నెలలే అవుతోంది.

Zoom layoffs: ప్రెసిడెంట్‌కు షాకిచ్చిన ‘జూమ్’.. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడి తొలగింపు

Zoom layoffs: వీడియో కమ్యూనికేషన్ సంస్థ ‘జూమ్’ తన ప్రెసిడెంట్‌కు షాకిచ్చింది. ఉన్నట్లుండి ఉద్యోగంలోంచి తొలగించింది. తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించింది.

Crude Oil Import: రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు.. రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి

దీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థలో ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ పొంది 10 నెలలే అవుతోంది. గత ఏడాది జూన్‌లోనే గ్రెగ్‌కు సంస్థ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. అంతకుముందు ఆయన చీఫ్ రెవెన్యూ ఆఫీసర్‌గా పని చేసేవారు. ఆయన 2019లో సంస్థలో చేరాడు. ప్రెసిడెంట్‌గా ఏడాది కూడా పూర్తి చేసుకోకుండానే గ్రెగ్ తన ఉద్యోగం కోల్పోయారు. ‘జూమ్’ సంస్థలో 15 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు ఈ కంపెనీ సీఈవో ఎరిక్ యువన్ గత నెలలో ప్రకటించారు.

Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??

దీనికి అనుగుణంగానే కంపెనీలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. 1,300 మంది ఉద్యోగులతోపాటు, ప్రెసిడెంట్‌ను కూడా తీసేశారు. కారణం లేకుండానే గ్రెగ్‌ను తొలగించడం విశేషం. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా తన వేతనాన్ని కూడా 98 శాతం తగ్గించుకోనున్నట్లు జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ ప్రకటించాడు. గ్రెగ్‌ను తొలగించినప్పటికీ, ప్రస్తుతానికి అతడి స్థానంలో వేరొకరిని నియమించుకునే ఆలోచన ఏదీ లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.