Imran Khan’s Pakistan Has Now Turned To Donkeys To Boost Friendship With China
Pak Donkeys to boost friendship with China : చైనా-పాకిస్తాన్ మధ్య స్నేహం.. పర్వతాల కంటే ఎత్తైనది.. సముద్రం కంటే లోతైనది.. ఉక్కు కంటే బలమైనది.. తేనె కంటే తియ్యనైనది.. ఇప్పుడా ఆ స్నేహబంధానికి పాకిస్తాన్ గాడిదలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే.. చిరకాల మిత్రుడు చైనాలో గాడిదలకు ఫుల్ డిమాండ్. అందుకే కాబోలు.. ఇమ్రాన్ పాక్ డ్రాగన్‌తో మైత్రిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం గాడిదల పెంపకం కోసం ఒకారా జిల్లాలో ఒక పొలాన్ని ఏర్పాటు చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తమ గాడిదల ఎగుమతి వ్యాపారాన్ని మరింత వేగవంతం చేయాలని యోచిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గాడిద పెంపకందారుగా చైనాకు పేరుంది. గాడిదల తోలును ఎజియావోలో కీలక పదార్ధంగా ఉపయోగిస్తుంది. ఇది సాంప్రదాయ చైనీస్ ఔషధం కూడా. రక్త ప్రసరణ, రక్తహీనత, సంతాన సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఔషధం పనితీరుపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ రుజువు కాలేదు. పంజాబ్‌లోని బహదూర్‌నగర్‌లో 3వేల ఎకరాల విస్తీర్ణంలో గాడిద ఫామ్‌ను ఏర్పాటు చేసినట్లు ఓ నివేదిక నివేదించింది. 2019 నివేదిక ప్రకారం.. 1992 నుంచి చైనా పీపుల్స్ రిపబ్లిక్‌లో 76శాతం గాడిదలు జనాభా తగ్గిపోయింది. దాంతో గాడిదల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. బీజింగ్ సాయం కోసం ఇస్లామాబాద్ వైపు చూడటానికి ముందు.. రెండు పశ్చిమ ఆఫ్రికా దేశాలు గాడిదలను ఎగుమతి చేశాయి. ఆ దేశంలో నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత గాడిద చర్మాలను నైజర్ బుర్కినా ఫాసో నుంచి దిగుమతి చేసుకునేది.
పాకిస్తాన్‌కు ఇది మొదటిసారి కాదు :
పాకిస్తాన్ తన మిత్రుడు చైనాకు గాడిద పెంపకంలో కొన్ని ఏళ్లుగా సాయం చేయడానికి కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా గాడిద చర్మవ్యాపారాన్ని విస్తరించాలని పాక్ నిర్ణయించడం ఇదేం మొదటిసారి కాదు. 2017లో ఒక నివేదిక ప్రకారం.. Khyber-Pakhtunkhwa ప్రభుత్వం ప్రావిన్స్‌లో గాడిదల సంతతి పెంచడమే లక్ష్యంగా Khyber-Pakhtunkhwa-China Sustainable Donkey Development Programme ప్రాజెక్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ ఒక 1 బిలియన్ డాలర్ ఉంటుంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) కింద వ్యవసాయ రంగంలో అదనపు పెట్టుబడులు పొందాలని పాక్ ఆశించింది. లాహోర్‌లో గాడిద ఆసుపత్రి, మన్సెహ్రాలో రెండు పొలాలు, పాకిస్తాన్‌లో డేరా ఇస్మాయిల్ ఖాన్ ఏర్పాటు చేసింది. 2015లో అప్పటి ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అధ్యక్షతన ఆర్థిక సమన్వయ కమిటీ తాత్కాలికంగా గాడిదల ఎగుమతిని నిషేధించింది. ఇప్పుడా గాడిదల ఎగుమతి నిషేధాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎత్తివేసింది.
US Troops : అప్ఘాన్ వీడుతూ 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆయుధాలు పని చేయకుండా చేసిన అమెరికా
Pakistan’s first donkey breeding farm in Okara. “The farm has been set up in response to the rising demand for donkeys in China and other countries.” https://t.co/o62P2XA2oW
— Naila Inayat (@nailainayat) August 28, 2021
మూడొంతులు తగ్గిన గాడిదల సంతతి :
ఏనుగు దంతాలు, హిప్పోపొటామస్, నార్వాల్ వాల్రస్, దంతాల మాదరిగానే.. గాడిదలను వధించి వాటి తోలును ఎగుమతి చేస్తోంది.. గాడిదల చర్మాన్ని ఉడకబెట్టి పురాతన చైనీస్ ఔషధం ఎజియావో జెల్ తయారీలో వాడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా గాడిద చర్మాలకు డిమాండ్ పెరగడంతో గాడిదల సంతతి క్షీణిస్తోంది. పాక్‌లో చాలావరకూ కుటుంబాలు గాడిదలపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. గాడిదలే అక్కడివారి ప్రాధాన ఆదాయ వనరు.. రవాణా మార్గం కోసం గాడిదలను పెంచుతుంటారు. గాడిదల డిమాండ్ కారణంగా వాటిని దొంగలించే ముప్పు కూడా పెరిగిపోయింది. పాకిస్తాన్, ఇతర మధ్యప్రాచ్య దేశాలే కాదు.. పెంపుడు జంతువులలో కూడా గాడిదల సంతతి అధిక ఉన్నట్లు తెలుస్తోంది.
UK పరిశోధన ప్రకారం.. ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఈ గాడిదలను పారిశ్రామిక స్థాయిలో వధించడం కారణంగా వాటి సంతతి క్షీణతకు దారితీసిందని నివేదిక తెలిపింది. చైనాలో ప్రతి ఏడాది నాలుగు మిలియన్లకు పైగా గాడిదల తోలును కాస్మెటిక్ ఉత్పత్తులు, (ejiao) జెల్ తయారీకి వాడుతున్నారు. అయితే ఈ జంతువుల ఎగుమతి 1.8 మిలియన్‌ల కంటే తక్కువగానే ఉందని నివేదిక చెబుతోంది. 1992లో 11 మిలియన్ గాడిదలు ఉండగా.. చైనాలో 2019 నాటికి గాడిదల సంతతి మూడొంతులు తగ్గిపోయింది. ఎజియావో పరిశ్రమకు అవసరమైన గాడిదల సంతతి పెరగాలంటే మరో 20 ఏళ్లు పట్టవచ్చని అంచనా.
US : అప్ఘాన్‌ను ఖాళీ చేసిన అమెరికా, సంబరాలు చేసుకున్న తాలిబన్లు