Wolf Caught On Camera
Viral Video: ఎరవేసి చేపలను, ఇతర ప్రాణులను పట్టడం మనుషులకు మాత్రమే తెలిసిన విద్య. ఏ జంతువుకూ ఇది సాధ్యం కాదు. అయితే, బ్రిటిష్ కొలంబియా మధ్య తీరంలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
స్థానిక హీల్ట్సుక్ జాతి వారు “యూరోపియన్ గ్రీన్ క్రాబ్” (సముద్ర పీత) అనే జాతిని నియంత్రించేందుకు క్రాబ్ ట్రాప్‌ల (పీతలను పట్టేందుకు సముద్రంలో పెట్టే వల)ను ఉపయోగించారు. “యూరోపియన్ గ్రీన్ క్రాబ్” స్థానిక జంతువులు, మొక్కలకు నష్టం చేస్తుండడంతో వాటిని ఎరవేసి పట్టుకుని కంట్రోల్ చేస్తున్నారు. (Viral Video)
పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా ఈ ట్రాప్‌లు వేశారు. అందుకు తాడును కూడా వాడారు. అక్కడకు వచ్చిన ఓ ఆడ తొడేలు తాడును ఉపయోగించి క్రాబ్ ట్రాప్‌ను నీటిలోనుంచి బయటికి లాగి, అందులోని ఎరను తిన్నది. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒక తొడేలు ఇలా తాడును లాగి ఎరను తినడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా పరిశోధకులు లోతైన నీటిలో వేసిన ట్రాప్‌లను తొడేళ్లు, ఎలుగుబంట్లు తాకలేవని అనుకున్నారు. ఇవి డైవ్ చేసే జీవులు కావని భావించారు. కొన్ని క్రాబ్ ట్రాప్‌లను తక్కువ లోతులో వేస్తారు. అక్కడికి ఎలుగుబంటి లేదా తొడేలు సులభంగా చేరుతుంది. కానీ మరికొన్ని ట్రాప్‌లు లోతైన నీటిలో ఉంటాయి.
తీరం వద్దకు వచ్చిన ఓ తొడేలు ఆ ట్రాప్‌ను బయటకు లాగింది. ఆ వలలోని ఎరను బయటకు లాగింది. ట్రాప్‌ను తక్కువ లోతున్న చోటికి ఈడ్చుకుని వెళ్లి, అందులోని ఎర అయిన ఒక హేరింగ్ (ఎరకోసం వాడిన సముద్రచేప) ముక్కను తిన్నది.
ట్రాప్ నీటిలో ఉండి కనిపించకపోయినా, తాడును గమనిస్తూ, ట్రాప్ ఎప్పుడు పైకి వస్తుందో చూస్తూ ఆ తొడేలు లాగిన తీరుకి ఆశ్చపోయామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇతర తొడేళ్లు కూడా తాడును ఉపయోగించడం నేర్చుకుంటాయా? అన్న విషయాన్ని కూడా భవిష్యత్తులో పరిశోధనల ద్వారా తేల్చుతామని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో జంతు ప్రవర్తన నిపుణుడు మార్క్ బెకాఫ్ అన్నారు.
Incredible. This wolf sees a buoy out in deep water and recognizes it’s attached to a crab trap filled with food as bait. She swims over to the buoy and pulls it to shore, knowing it’ll drag the trap w/ bait out, too. Voila, free meal.
Animals use tools, just like us. pic.twitter.com/Sf55r8XS4g
— Wayne Hsiung (@waynehhsiung) November 19, 2025