India Storng Counter To Pakistan: పాక్ ప్రధాని వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్.. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ వ్యాఖ్యలన్నీ అబద్దాలే ..

పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని చెప్పాడని, అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని. భారత్ లోని ముంబయిలో భీకర ఉగ్రపేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరంటూ పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో అన్నారు.

Mijito Vinito

India Storng Counter To Pakistan: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో మాట్లాడుతూ..  పాకిస్థాన్ ప్రధాని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్దాలని, అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్ భారత్ పై ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యతనివ్వడం దురదృష్టకరమని అన్నారు. 1993 ముంబై పేలుళ్ల కారణం అయిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని, శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్న పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pakistan PM Sharif: భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్‌జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని

పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని చెప్పాడని, అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరన్నారు. భారత్ లోని ముంబయిలో భీకర ఉగ్రపేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరు, శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగు దేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు అంటూ పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఐరాసలో భారత శాశ్వత బృందం తొలి కార్యదర్శి మిజిటో వినిటో అన్నారు.

Bharat Jodo Yatra: కేరళలో 17వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు (ఫొటో గ్యాలరీ)

అంతకుముందు.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ భారత్‌తో పాటు అన్ని దేశాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటోందని, అయితే అది కాశ్మీర్ సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడు మాత్రమేనంటూ అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను మార్చడానికి భారత్ చట్టవిరుద్ధమైన ఏకపక్ష చర్యలకు పాల్పడుతోందని ప్రాంతీయ ఉద్రిక్తతలకు భారత్ పాల్పడుతోందని పాక్ ప్రధాని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ధీటుగా భారత్ కౌంటర్ ఇచ్చింది.