Pakistan PM Sharif: భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్‌జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని

భారత్‌తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.

Pakistan PM Sharif: భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం.. యుఎన్‌జీఎలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ ప్రధాని

Pakistan PM Sharif

Pakistan PM Sharif: భారత్‌తో సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 77వ సెషన్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. మేము భారతదేశంతో సహా మా పొరుగు దేశాలతో శాంతి కోసం చూస్తున్నాం. దక్షిణాసియాలో సుస్థిరమైన శాంతి, స్థిరత్వం జమ్మూ కాశ్మీర్ వివాదానికి న్యాయమైన, శాశ్వతమైన పరిష్కారంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

Pakistan floods : పాక్‌లో మతసామరస్యం .. వరదల నుంచి కాపాడి వందలాది ముస్లింలకు హిందూ దేవాలయంలో ఆశ్రయం

మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 A రద్దు అంశాన్ని పాక్ ప్రధాని మళ్లీ లేవనెత్తారు. జమ్మూ – కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. నిర్మాణాత్మక అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు భారతదేశం విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని, మనం శాంతితో జీవించాలా.. లేదా ఒకరితో ఒకరు పోరాడుతూనే ఉండాలా అనే ఎంపిక మనదేనంటూ పాక్ ప్రధాని అన్నారు. 1947 నుంచి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మూడు యుద్ధాలు జరిగాయని, పర్యవసానంగా ఇరువైపులా కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మాత్రమే పెరిగిపోయాయని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా సైనిక సాయంపై భారత్ ఆగ్రహం.. తమ అభ్యంతరాలు తెలిపిన భారత్

మన సమస్యలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఇప్పుడు మనపై ఉందని షెహబాజ్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ సమస్యను చాలాసార్లు లేవనెత్తారు. భారత్‌తో శాంతియుత సంబంధాలకోసం కూడా విజ్ఞప్తి చేశారు. మరోవైపు కాశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన రెండు రోజుల తర్వాత UNGA 77వ సెషన్‌లో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.