Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా సైనిక సాయంపై భారత్ ఆగ్రహం.. తమ అభ్యంతరాలు తెలిపిన భారత్

ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల సైనిక సాయం అందించేందుకు అమెరికా నిర్ణయించింది. అమెరికా నిర్ణయం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన డొనాల్డ్ ల్యూకు తమ అభ్యంతరాలను తెలిపింది.

Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా సైనిక సాయంపై భారత్ ఆగ్రహం.. తమ అభ్యంతరాలు తెలిపిన భారత్

India vs america

Pakistan: ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల సైనిక సాయం అందించేందుకు అమెరికా నిర్ణయించింది. ఎఫ్ -16 యుద్ద విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్, ఇంజిన్ హార్డ్‌వేర్ ఆధునికీకరణ ఎలక్ట్రానిక్ పోరాట సామర్థ్యం తదితరాలను అమెరికా పాక్‌కు సమకూర్చనుంది. అమెరికా నిర్ణయం పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిథి డోనాల్డ్ ల్యూ కు అభ్యంతరాలను తెలియజేసింది.

Pakistan floods: పాకిస్తాన్‌లో వరదలకు 1,290 మంది మృతి.. నిరాశ్రయులైన 6 లక్షల మంది

అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్ విఫలమైనందున 2018లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపివేసింది. అయితే ప్రస్తుత జో బైడెన్ ప్రభుత్వం దానిని పునరుద్దరిస్తూ పాక్ కు రూ. 450 మిలియన్ డాలర్లును అందిస్తున్నట్లు తమ కాంగ్రెస్ (పార్లమెంటు)కు బైడెన్ సర్కార్ తెలిపింది.

Cotton Imports From India: ఇండియన్ కాటన్ కొనాలంటూ పాక్ ప్రభుత్వాన్ని కోరిన అక్కడి వ్యాపారులు.. ఎందుకో తెలుసా?

పాకిస్థాన్ కు భారీ సైనిక సాయం చేయడాన్ని అమెరికా సమర్థించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ కు ఈ సహాయం ఉపరిస్తుందని జోబైడెన్ తెలిపారు. అమెరికా తీరుపై మాత్రం భారత్ అభ్యంతరం తెలిపింది. ఇదిలాఉంటే ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్, అమెరికా మధ్య సెప్టెంబర్ 7, 8 తేదీల్లో 2ప్లస్2 ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాకిస్థాన్ కు అమెరికా భారీ సైనిక సాయం అందించడం గమనార్హం.