Cotton Imports From India: ఇండియన్ కాటన్ కొనాలంటూ పాక్ ప్రభుత్వాన్ని కోరిన అక్కడి వ్యాపారులు.. ఎందుకో తెలుసా?

ఇండియా నుంచి భారీ స్థాయిలో పత్తి దిగుమతి చేసుకోవాలని పాక్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే ఆ దేశంలో వరదల కారణంగా పత్తి చాలా వరకు పాడైంది. దిగుమతి కూడా తగ్గిపోనుంది.

Cotton Imports From India: ఇండియన్ కాటన్ కొనాలంటూ పాక్ ప్రభుత్వాన్ని కోరిన అక్కడి వ్యాపారులు.. ఎందుకో తెలుసా?

Cotton Imports From India: భారత దేశంలో ఉత్పత్తి చేసే పత్తిని కొనాలంటూ పాకిస్తాన్‌కు చెందిన టెక్స్‌టైల్ వ్యాపారులు అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కారణం.. అక్కడి టెక్స్‌టైల్ వ్యాపారులు తీవ్రమైన పత్తి కొరత ఎదుర్కొంటున్నారు.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల ధాటికి దేశంలో నిల్వ ఉన్న పత్తిలో దాదాపు 25 శాతంపైగా పాడైంది. అలాగే పత్తి ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది. దీంతో పత్తిపై ఆధారపడి పనిచేసే టెక్స్‌టైల్ వ్యాపారులు తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ వ్యాపారాలు మనుగడ సాగించాలంటే ఇండియా నుంచి కాటన్ దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. కొంతకాలంగా పాకిస్తాన్ మన దేశ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం లేదనే సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాటన్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని అక్కడి వ్యాపారులు అంటున్నారు.

Amaravati Farmers: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి

భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా నుంచి రోడ్డు మార్గంలో పత్తి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించాలని పాక్ ఆర్థిక శాఖా మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ను కోరారు. మన దేశం నుంచి 2.5 మిలియన్ బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని సూచించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన పాక్.. తిరిగి మన దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో తీవ్ర ఆహార కొరత ఉండటంతో, దీన్ని ఎదుర్కోవాలంటే భారత్ నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోంది.