iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే

iPhone 14: కొత్తగా వచ్చిన ఐఫోన్ 14ను అమెరికా నుంచి తెప్పించుకుందాం అనుకుంటున్నారా? అలా చేసి డబ్బులు సేవ్ చేసుకుందామనుకుంటున్నారా? అయితే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. లేదంటే తర్వాత ఫీలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో విడుదల కానున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

ఔను! తాజాగా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్లకు సంబంధించి అమెరికాలో కొత్త వెర్షన్ రిలీజవుతుంది. అంటే అందులో సిమ్ ట్రే ఉండదు. ఇ-సిమ్ ఆధారంగానే పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ఇ-సిమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అంటే సిమ్ కార్డు లేకుండానే, ఒక యునిక్ నెంబర్ కలిగిన టెక్నాలజీతో ఇది సిమ్‌లా పనిచేస్తుంది. ఫిజికల్ సిమ్ లేకుండానే ఫోన్ వాడుకోవచ్చు. ఈ టెక్నాలజీని వాడి ఐఫోన్లలో ఇ-సిమ్ మాత్రమే ఉంచబోతున్నారు. ఇది ఫోన్ మదర్‌బోర్డుతో కలిసి ఉంటుంది. దీన్ని తీయడానికి వీల్లేదు. మన దేశంలో ఇంకా ఇ-సిమ్ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. అందువల్ల అమెరికా నుంచి ఫోన్ తెప్పించుకున్నా ఇక్కడ వాడుకోవడం కుదరదు.

Balapur Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

అమెరికాతోపాటు విదేశాల నుంచి చాలా మంది ఐఫోన్లు తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి వచ్చే తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ద్వారా ఫోన్లు తెప్పించుకుంటారు. ఎందుకంటే అక్కడ ఫోన్ల ఖరీదు చాలా తక్కువ. మన దేశంలో పన్నుల మూలంగా ఐఫోన్లతోపాటు, యాపిల్ ప్రొడక్ట్స్ ధరలు ఎక్కువ. అందువల్ల చాలా మంది డబ్బులు సేవ్ చేసుకోవడానికి తమకు తెలిసిన వారి ద్వారా ఐఫోన్లు తెప్పించుకుంటూ ఉంటారు.