Balapur Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

బాలాపూర్ గణేష్ లడ్డు వేలం గత రికార్డులు తిరగరాస్తూ భారీ ధరకు అమ్ముడైంది. రూ.24.60 లక్షలకు ఈ ఏడాది లడ్డూ అమ్ముడైంది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నాడు.

Balapur Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

Updated On : September 9, 2022 / 10:58 AM IST

Balapur Laddu: ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు రికార్డు ధరకు అమ్ముడైంది. గత రికార్డులు బ్రేక్ చేస్తూ ఈసారి వేలంలో రూ.24.60 లక్షల ధర పలికింది. వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఆయన బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. శుక్రవారం ఉదయం జరిగిన వేలంలో మొత్తం 9 మంది పాల్గొన్నారు.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

వీరిలో ముగ్గురు స్థానికేతరులు, ఆరుగురు స్థానికులు. వేలం పోటాపోటీగా సాగింది. ఈ సారి రూ.20 లక్షల వరకు ధర పలుకుతుందని అందరూ భావించారు. కానీ, ఈ అంచనాలు తలకిందులు చేస్తూ రూ.24.60 లక్షల ధర పలికింది. గతేడాది కంటే ఈసారి రూ.5.70 లక్షలు అధికంగా ధర పలికింది. ముందుగా రూ.450తో వేలం ప్రారంభమైంది. 1994 నుంచి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. వేలంపాట పూర్తైన తర్వాత బాలాపూర్ గణేష్ శోభాయాత్ర మొదలవుతుంది.