Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

భారత స్టార్ అథ్లెట్ మరో భారీ విజయాన్ని అందుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో జరిగిన డైమండ్ ట్రోఫీలో విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు.

Neeraj Chopra: నీరజ్ చోప్రా మరో రికార్డు.. డైమండ్ ట్రోఫీ గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఘనత

Neeraj Chopra: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సాధించారు. మెన్స్ జావెలిన్ థ్రోలో డైమండ్ ట్రోఫీ గెలిచి, ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు.

BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో గురువారం మెన్స్ జావెలిన్ డైమండ్ లీగ్ ఫైనల్ పోటీ జరిగింది. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాడ్లెక్, జర్మనీకి చెందిన జులియన్ వెబ్బర్‌ను దాటుకుని విజేతగా నిలిచాడు. నీరజ్ 88.44 మీటర్లు జావెలిన్ థ్రో చేసి మొదటి స్థానం సంపాదించి, డైమండ్ ట్రోఫీ గెలుపొందాడు. నీరజ్ వరుసగా 84.15 మీటర్లు, 88.44 మీటర్లు, 88.00 మీటర్లు, 86.11 మీటర్లు, 87.00 మీటర్లు, 83.60 మీటర్లు జావెలిన్ థ్రో చేశారు. రెండోసారి అత్యధికంగా 88.44 మీటర్లు థ్రో చేయగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాడ్లెక్ రెండో సారి 86.94 మీటర్లు థ్రో చేశాడు. దీంతో మిగతా ఇద్దరు ఆటగాళ్లకంటే మెరుగైన ప్రదర్శన చేసి నీరజ్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్‌లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..

రెండో స్థానంలో నిలిచిన వాడ్లెక్ సాధించిన అత్యధిక స్కోరు కంటే నీరజ్ మూడుసార్లు ఎక్కువ స్కోరు సాధించాడు. గత ఏడాది ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. గతంలో కూడా నీరజ్ డైమండ్ ‌లీగ్‌లో పాల్గొన్నాడు. 2017లో ఏడో స్థానంలో నిలవగా, 2018లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి ట్రోఫీ సాధించారు.