Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్‌లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..

రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్‌లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..

Queen Elizabeth's Visits To India

Queen Elizabeth II: బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96 సంవత్సరాలు) గురువారం స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్ క్యాజిల్ లో కన్నుమూశారు. బ్రిటన్ కు ఆమె ఏకంగా 70ఏళ్లపాటు మహారాణిగా వ్యవహరించారు. క్విన్ ఎలిజబెత్-2 పూర్తి పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ. క్విన్ విక్టోరియా పాలన (63సంవత్సరాల 7నెల 2 రోజులు) రికార్డును బద్దలు కొడుతూ బ్రిటన్ ను అత్యధిక కాలం పాలించిన రాణిగా 2015లోనే ఎలిజబెత్-2 రికార్డు సృష్టించారు.

Queen Elizabeth II

Queen Elizabeth II

రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఎలిజబెత్ ను చూసేందుకు అప్పట్లో ప్రజలు బారులు తీరేవారు.

Queen Elizabeth during her visit to India

Queen Elizabeth during her visit to India

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దాదాపు 15 సంవత్సరాల తరువాత ఆమె భారత్ లో మొదటిసారిగా పర్యటించారు. క్విన్ ఎలిజిబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ 1961లో మొదటిసారి భారత్ లో పర్యటించారు. వారి పర్యటనలో రాజ దంపతులు పలువురు దేశాధినేతలను కలుసుకున్నారు. తాజ్ మహల్ తో సహా దేశంలోని అత్యంత ఇష్టమైన చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. న్యూ ఢిల్లీలోని రాజ్ పథ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అప్పట్లో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు.

Queen Elizabeth at the Taj Mahal in 1961

Queen Elizabeth at the Taj Mahal in 1961

1961లో ఎలిజబెత్-11 భారత్ పర్యటనలో భాగంగా రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. గాంధీ సమాధి వద్ద ఉన్న సందర్శకుల పుస్తకంలో రాణి పలు వ్యాఖ్యాలు రాసింది. ఆమె సంతకం కాకుండా ఏదైనా రాయడం చాలా అరుదు.

The Queen and Prince Philip's signatures in the visitors' book

The Queen and Prince Philip’s signatures in the visitors’ book

1961లో ఆమె పర్యటన సమయంలో అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) భవనాన్ని ప్రారంభించారు.

Elizabeth-11 riding an elephant in Varanasi

Elizabeth-11 riding an elephant in Varanasi

రాణి ఆగ్రా, బొంబాయి (ప్రస్తుతం ముంబై), బెనారస్ (ప్రస్తుతం వారణాసి), ఉదయపూర్, జైపూర్, బెంగళూరు (ప్రస్తుతం బెంగళూరు), మద్రాస్ (ప్రస్తుతం చెన్నై), కలకత్తా (ప్రస్తుతం కోల్ కతా) సందర్శించారు. వారణాసిలో ఆమె పూర్వపు బెనారస్ మహారాజు అతిథ్యాన్ని స్వీకరిస్తూ ఏనుగుపై ఊరేగింపులో పాల్గొన్నారు.

Queen Elizabeth and The Maharaja of Jaipur, Sawai Man Singh II, ride on an elephant on February 6, 1961.

Queen Elizabeth and The Maharaja of Jaipur, Sawai Man Singh II, ride on an elephant on February 6, 1961.

ఎలిజబెత్-11 ఉదయపూర్ ను కూడా సందర్శించారు. వారిని మహారాణా భగవత్ సింగ్ మేహర్ స్వాగతించారు. రాజ దంపతులను స్వాగతించడంలో తనతో కలిసి వచ్చిన 50 మందికిపైగా ప్రభువులకు రాణిని పరిచయం చేశారు.

Queen Elizabeth meets then Prime Minister Indira Gandhi at Hyderabad House in New Delhi in 1983.

Queen Elizabeth meets then Prime Minister Indira Gandhi at Hyderabad House in New Delhi in 1983.

ఎలిజబెత్ రాణి 1983లో మరోసారి భారత్ లో పర్యటించారు. ఆ సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. 1983లో అప్పటి ప్రెసిడెంట్ గియానీ జైల్ సింగ్ ఆహ్వానం మేరకు రాణి, ప్రిన్స్ ఫిలిప్ దేశాన్ని సందర్శించారు. ఈ సారి రాజ దంపతులు రాష్ట్రపతి భవన్ లో బస చేశారు. ఈ పర్యటనలో భాగంగా రాణి మదర్ థెరిసాకు గౌరవ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను బహుకరించారు.

Queen Elizabeth presents the Order of Merit to Mother Teresa in 1983 in Delhi. (Getty Image)

Queen Elizabeth presents the Order of Merit to Mother Teresa in 1983 in Delhi. (Getty Image)

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఆమె మూడవ సారి భారత్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలిజబెత్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ మెమోరియల్ ను సందర్శించారు.

The Queen makes her way from the Golden Temple of Amritsar.

The Queen makes her way from the Golden Temple of Amritsar.

1997 సంవత్సరంలో నటుడు కమల్ హాసన్ నటించిన ప్రతిష్టాత్మక చలనచిత్ర మరుదనాయగం సెట్‌ను కూడా సందర్శించారు. చెన్నైలోని ఎంజీఆర్ ఫిల్మ్ సిటీకి చేరుకున్నఎలిజబెత్-11 సుమారు 20 నిమిషాల పాటు అక్కడ గడిపారు.

Actor Kamal Haasan with Quinn Elizabeth-11 at MJR Film City

Actor Kamal Haasan with Quinn Elizabeth-11 at MJR Film City