ఏపీలో “రౌడీషీటర్ల బహిష్కరణ” పొలిటికల్ ఇష్యూ కాబోతోందా?
రౌడీలు అనే వారు రాష్ట్రంలో ఉండేందుకు వీళ్లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అవసరమైతే నోటోరియస్ రౌడీలను రాష్ట్రం నుంచి పంపించేందుకు కూడా వెనుకాడొద్దని స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh: అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో చెప్పక్కర్లేదు. వ్యవస్థ తన పని తాను చేసుకుపోవాలి..అంతా సిస్టమ్ ప్రకారం జరగాలని కోరుకునే నేత. అలాంటి చంద్రబాబు ఈ సారి ఏపీలో పవర్‌లోకి వచ్చాక..అంతా సెట్‌రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. రౌడీయిజం, గూండాయిజం, గంజాయి బ్యాచ్ అరాచకాలు, దందాలు, సెటిల్‌మెంట్లకు చెక్ పెట్టే స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు.
ఏపీలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపేందుకు ఏ మాత్రం వెనకాడొద్దని ఆదేశించారు. వింటే విన్నారు. గతం గతః అని సెట్‌రైట్ అయితే ఓకే. కాదు కూడదంటే..ఎవర్ని వదిలిపెట్టొద్దని.. నోటోరియస్ రౌడీషీటర్లను అవసరమతే రాష్ట్ర బహిష్కరణ చేయాలని చంద్రబాబు పోలీస్ అధికారులకు సూచించారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసే పనిలో ఉన్నారట పోలీస్ అధికారులు. ఏపీలో దాదాపు 9 వేల మంది రౌడీ షీటర్లు ఉండగా..అందులో ఎక్కువ మంది పట్టణాల్లోనే ఉంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. (Andhra Pradesh)
Also Read: అమెరికా గ్రీన్ కార్డు లాటరీని నిలిపేసిన ట్రంప్.. ఏంటి ఇది? భారతీయులపై ప్రభావం ఉంటుందా?
అయితే సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల చుట్టూ చర్చ జరుగుతోంది. రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి రౌడీల బహిష్కరించడం సాధ్యమేనా అన్న డిస్కషన్ మొదలైంది. కత్తిపోట్లు, హత్యాయత్నం, వేధింపుల కేసులు ‘A’ కేటగిరీలో ఉండగా.. B-కేటగిరిలో వరుస దొంగతనాలు, మద్యం, డ్రగ్స్ రాకెట్లు, గ్యాంగ్ దాడులు ఉన్నాయి. ఇక C-కేటగిరిలోడ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ బియ్యం సప్లై చేసే నేరస్తులు ఉన్నారు. రౌడీ షీటర్లలో ఎక్కువ మంది పొలిటికల్ లీడర్లు, మద్యం వ్యాపారులు ఉన్నట్లు కూడా అంచనాలు ఉన్నాయి. దాదాపు 15వందల మంది వరకు కరుగుడట్టిన నేరస్తులు ఉన్నారని పోలీసులు ఐటెండిఫై చేశారట.
రిపీటెడ్‌గా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్!
ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో రిపీటెడ్‌గా నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా రెడీ అవుతోందట పోలీస్ శాఖ. రౌడీలు అనే వారు రాష్ట్రంలో ఉండేందుకు వీళ్లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అవసరమైతే నోటోరియస్ రౌడీలను రాష్ట్రం నుంచి పంపించేందుకు కూడా వెనుకాడొద్దని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. జిల్లాలో ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి వార్నింగ్ ఇచ్చి..వినకపోతే పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్, లా అండ్ ఆర్డర్ విషయంలో సీరియస్‌గానే ఉంటామన్నారు.
అయితే ప్రజా ఉద్యమాలు చేసిన లీడర్లపై పలు కేసులు ఉండటం..కొందరు రాజకీయ నేతలపై కూడా రౌడీషీట్లు నమోదై ఉండటంతో..ఏపీ సీఎం వ్యాఖ్యలు.. రౌడీషీటర్ల బహిష్కరణ అంశం చర్చకు దారితీస్తోంది. పలు పార్టీలతో సంబంధం ఉన్నోళ్లు, రాజకీయ ప్రేరేపిత కేసులతో సతమతం అవుతున్న వారిని కావాలని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగొచ్చన్న టాక్ మొదలైంది. తమ మాట వినని రౌడీషీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తే పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది.
సేమ్‌టైమ్ రౌడీషీటర్లలో చాలామందికి ఏదో ఒక పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారిని సేవ్ చేసి..ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులను రాష్ట్ర బహిష్కరణ చేసే అవకాశాలు లేకపోలేదంటూ డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే..రౌడీ షీటర్ల బహిష్కరణ అంశం పొలిటికల్ కాంట్రవర్సీకి..రాజకీయ రచ్చకు దారి తీయడం పక్కా అన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. ఏపీ సర్కార్ రౌడీ షీటర్లను బహిష్కరిస్తుందా.? రాష్ట్రం నుంచి ఎంత కాలం బహిష్కరించే అవకాశం ఉంటుంది.? రౌడీషీటర్ల బహిష్కరణ ప్రభుత్వ డెసిషనా? న్యాయస్థానాల నిర్ణయమేనా? అనేది వేచి చూడాలి.
